గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By JSK
Last Modified: శనివారం, 1 అక్టోబరు 2016 (17:46 IST)

వ‌ర‌ల‌క్ష్మి, విశాల్ ఎక్కువకాలం ప్రేమించుకున్నారు... అందుకే...

ఎక్క‌ువ కాలం ప్రేమించుకుంటుంటే... ఆ ప్రేమ పెళ్ళి వ‌ర‌కు చేర‌దంటారు... విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల విష‌యంలో ఇదే జ‌రిగిన‌ట్లుంది. తమిళ స్టార్ హీరో విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల ప్రేమాయ‌ణం కథ కంచికి చేరినట్టుంది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ లు గత ఏడేళ్ళుగా ప

ఎక్క‌ువ కాలం ప్రేమించుకుంటుంటే... ఆ ప్రేమ పెళ్ళి వ‌ర‌కు చేర‌దంటారు... విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల విష‌యంలో ఇదే జ‌రిగిన‌ట్లుంది. తమిళ స్టార్ హీరో విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల ప్రేమాయ‌ణం కథ కంచికి చేరినట్టుంది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ లు గత ఏడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఆ మధ్య తమిళ నడిఘర్ సంఘం నిర్మించే పెళ్ళి మంటపంలో మొట్టమొదటి పెళ్ళి మాదే అని విశాల్ ప్రకటించాడు. 
 
అయితే ఇప్పుడు వరలక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో ఏడేళ్ళ బంధాన్ని ఓ వ్యక్తి తేలికగా తీసుకుంటున్నాడని, ప్రేమ పరిహాసంగా మారుతోందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో ఇక విశాల్, వరలక్ష్మి ప్రేమకథకి ముగింపు అనుకున్నారంతా. కానీ, ఇది కేవలం ట్వీట్ మాత్రమే. ప్రస్తుతం నేను వర్క్ మీద దృష్టి పెడుతున్నాను అని మళ్ళీ ట్వీట్ చేసింది వరలక్ష్మి.
 
నిజానికి తమిళ నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్, విశాల్ మధ్య పతాక స్థాయిలో గొడవలు జరిగాయి. ఒకవేళ ఆ ప్రభావం వలనే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై విశాల్ ఏమంటాడో మ‌రి.