బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోచ్, నటుడు సునీల్ థాపా ఇకలేరు..
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కోచ్, నేపాల్ నటుడు సునీల్ థాపా ఇకలేరు. ఇటు భారత్, అటు నేపాల్ చలనచిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సునీల్ థాపా (68) కన్నుమూశారు. నేపాల్‌లోని ఖాట్మండులో శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది.
1970వ దశకంలో ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సునీల్ థాపా.. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశారు. 300కు పైగా నేపాలీ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ సంపాదించారు. ప్రధానంగా చినో చిత్రంలో ఆయన పోషించిన రాతే కైలా పాత్ర నేటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
బాలీవుడ్‌లో 'ఏక్ ధూజే కే లియే' చిత్రంలో అరంగేంట్రం చేసిన ఆయన 'మేరీ కోమ్' సినిమాలో ప్రియాంకా చోప్రాకు కోచ్‌గా నటించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. సునీల్ థాపా అంత్యక్రియలు ముంబై నుంచి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఆదివారం ఖాట్మండులో నిర్వహించనున్నట్టు నేపాల్ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్లడించింది.