గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (18:18 IST)

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

nagarjuna - vijay sethupati - mohan lal
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నిత్య యవ్వనంగా కనిపిస్తుండటం ఇపుడు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అందుకే నాగార్జునను చూస్తే అనేక మంది హీరోహీరోయిన్లు అసూయ పడుతుంటారు. తాజాగా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా నాగార్జున యవ్వనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు మనవళ్లు పుట్టినా నాగార్జున మాత్రం అలానే ఉన్నారని, అందువల్ల ఆయనను తీసుకెళ్లి యాంటీ ఏజింగ్ పరీక్షలు చేయాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 
 
జియో హాట్‌స్టార్ చెన్నై నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజయ్ సేతుపతితో పాటు అక్కినేని నాగార్జున, మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, నా చిన్నపుడు ఆయన ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. యాంటీ ఏజింగ్‌పై పరిశోధనలు చేసేవాళ్లు ఆయన్ని కొన్ని రోజుల పాటు తీసుకెళ్లి పరీక్షలు చేయాలి. ఆయన జట్టు, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. నాకు మనవళ్లు పుట్టి, వాళ్లు పెద్దవాళ్లయినా సరే నాగార్జున ఇలానే యంగ్‌గా ఉంటారు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, బిగ్ బాస్ తమిళ సీజన్‌ 8కి విజయ్ సేతుపతి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.