శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 14 జులై 2015 (16:51 IST)

చుట్ట కాలుస్తూ.. స్టైలిష్‌గా విజయ్... కొత్త చిత్రం స్టిల్ అదుర్స్... విమర్శలు తప్పవేమో..!

ఇలయ దళపతి విజయ్ తాజాగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్టిల్ వెలువడింది. అందులో తలపై టోపీ పెట్టుకుని, కూలింగ్ గ్లాస్‌తో, చేతిలో చుట్ట పట్టుకుని తాగుతూ విజయ్ యమా స్టైలిష్‌గా ఉన్నారు. 
 
గతంలో తుపాకి చిత్రంలో విజయ్ ఫస్ట్‌లుక్ ఫోటోలో కూడా ఇదే విధంగా చేతిలో సిగరెట్‌తో విజయ్ అదరగొట్టాడు. అయితే ఆ స్టిల్స్‌పై అప్పట్లో పలు విమర్షలు వెలువడ్డాయి. హీరో స్టైల్‌లో ఫాలో అయ్యే యువత భవిష్యత్తు ఇటువంటి స్టిల్స్‌‌ వలన పాడవుతుందంటూ పలువురు వ్యతిరేకత తెలిపారు. అందుకు స్పందించిన మురుగదాస్ ఈ స్టిల్ ప్రకటన కోసమేనని, సినిమాలో లేదని వివరించారు.

ప్రస్తుతం విజయ్ చుట్టతాగితే సమస్య అవుతుందని తెలిసినా మళ్లీ విజయ్ నోట్లో చుట్ట పెట్టుకున్నాడు. ఈ ఫోటో ఎంతటి దుమారాన్ని రేపుతుందో వేచి చూడాలి.