సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (19:58 IST)

Virosh Reception: విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే

Virosh - Weedding Receiption
Virosh - Weedding Receiption
పోలీస్ ఆంక్షల నేపథ్యంలో మీ భద్రత ముఖ్యమని విరోష్ టీమ్ కు విజ్ఞప్తి చేశారు. దానితో మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న రిసెప్షన్ కు ఆంక్షలు విధించారు.  ఇండియా లోనే క్రేజీ వెడ్డింగ్ ఈవెంట్ గా విరోష్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పెళ్లి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించింది.
 
 ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఈ నెల 4న సాయంత్రం విజయ్ దేవరకొండ, రశ్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు ఈ రిసెప్షన్ లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది.