Vishal :విశాల్ చిత్రం మకుటం ట్రైలర్, విడుదల తేదీ ఖరారు
Vishal three getups
ఇప్పటికే విశాల్ మకుటంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచేలా కనిపిస్తున్నారు.
ఈ సినిమాకి రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరామెన్లుగా, N.B. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక ఈ మూవీని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు - విశాల్, అంజలి, దుషార విజయన్, జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు
