Thaman: ప్రజలు హ్యాపీగా వుండేందుకే ఓజీ టూర్ చేస్తున్నాం : థమన్
Thaman OG Tour
వారంతా హ్యాపీగా వచ్చి తిరిగి వెళ్ళాలి. కేవలం ప్రజల హ్యాపీనెస్ కోసమే ఈ షో చేస్తున్నాం. శరవణ్ సతీష్ గారు దీనికి నిర్వాహకులుగా వున్నారు. దాదాపు ఏ దైనా షో చేయాలంటే స్టేజీ ఏర్పాట్లు, ముంబై నుంచి లైటింగ్, కింద లారీలతో ఇసుక, కుర్చీలు, వారికి వసతి ఏర్పాట్లు ఇలా దాదాపు 2 కోట్లు ఖర్చవుతుంది. దానిని సతీష్ గారు బాగా నిర్వహించగలరు.
ఇక మన పాటలు అనేవి చాలా ఎనర్జీగా వుంటాయి. పాటలు పాడేటప్పుడు డాన్స్ చేస్తూ పాడుతుండాలి. అంత ఎనర్జీగా వుంటాయి. నేను పలు భాషల్లో పాడి సక్సెస్ అయినా పాటలనే ఎంపిక చేసుకుని షో లో పాడుతుంటాను. షో పర్మిషన్ కోసం పోలీసు కమిషనర్ ను కలుస్తున్నాం. హైదరాబాద్ తర్వాత, వైజాగ్, విజయవాడ, అనంతపూర్ లలో షోలు చేయనున్నాం. తర్వాత చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాలలో నిర్వహిస్తున్నాం.
