శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 14 మార్చి 2026 (11:45 IST)

Mehar Ramesh: సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం, దాసరి విగ్రహానికి స్టేజీ ఏర్పాటు:: మెహర్ రమేష్

Mehar Ramesh and direcotrs team
Mehar Ramesh and direcotrs team
ఇటీవలే ఎంపికైన దర్శకుల సంఘం తన కార్యాచారణ ప్రకటించింది. నిన్న ఫిలింఛాంబర్ లో జరిగిన సభలో వారు అసోసియేషన్ సభ్యుల కోసం చేస్తున్న సేవ గురించి ప్రస్తావించారు. కోశాధికారి దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ, సాయిరాజేష్ సభ్యుల కోసం సేవ చేయాలని పోటీలో పాల్గొని నెగ్గారు. చాలామంది హీరోలు, దర్శకుడు, నిర్మాతలు కూడా అసోసియేషన్ క్షేమం కోసం నిధిని తీసుకురావడంలో రాజేష్ పాత్ర కీలకం. కోవిడ్ టైంలో చాలామంది ఇండస్ట్రీ పెద్దలు చేసిన సాయం మర్చిపోలేది.
 
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్" కోశాధికారిగా, TFDAలో ఇటీవల విజయం సాధించిన ప్యానెల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దాతల పేర్లను మరియు వారు అందించిన ఉదార ​​సహాయాన్ని నేను ప్రకటిస్తున్నానన్నారు.  మీరు అందించిన ఆదరణకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. 'THE ORIGINAL INSURANCE COMPANY' (శ్రీ విప్పిన్) ద్వారా 716 మంది సభ్యులకు మరియు వారిపై ఆధారపడిన 1192 మంది కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం, నిరుపేదలకు ఒక గొప్ప వరంగా నిలుస్తుంది.  పూరి జగన్నాధ్ నుండి మొదటి విరాళం సహాయంతో దాదాపు రెండేళ్లు మేము 1.5 కోట్లు చెల్లించాము
 
మహేష్ బాబు 10 లక్షలు, నిర్మాత ఎస్.కె.ఎన్. 10 లక్షలు, ప్రభాస్ 35 లక్షలు, సుకుమార్ 25 లక్షలు ఇస్తూ, ఇంకా సభ్యుల కోసం కావాలంటే ఇస్తానని ఉదారతను ప్రకటించారు. బన్నీ వాస్  5 లక్షలు, నిర్మాత మణికంఠ 3 లక్షలు, యువీ క్రియేషన్స్ 14 లక్షలు, రాజేష్ దండా 5 లక్షలు, హీరో కిరణ్ అబ్బవరం 5 లక్షలు, మైత్రీమూవీస్ 15 లక్షలు, అనిల్ రావిపూడి, సాహుగారపాటి 7లక్షలు, సితార ఎంటర్ టైన్ మెంట్ నుంచి 12 లక్షలు, ధీరజ్ గోగినేని 2 లక్షలు, ఓదెల శ్రీకాంత్, 2 లక్షలు, సుహాస్ 1 లక్ష ఇలా ఎంతోమంది సహకరించారు.
 
ఇటీవలే కొందరికి అనారోగ్యం వల్ల సాయం చేయడం కూడా జరిగింది. అనారోగ్యం పాలైన నారాయణమూర్తికి లక్ష, అనిల్ రావిపూడి తమ్ముడు 50 లక్షలు ఇలా పలువురికి అసోసియేషన్ సాయం చేసింది. అలదేవిధంగా కోవిడ్-19 సమయంలో "తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్" 1000 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 5,000 ₹ మొత్తం 50 లక్షలు సహాయం చేసింది. ఆట్రస్ట్ వ్యవస్థాపకులు & చైర్మన్ శ్రీ రాఘవేందర్రావు, మేనేజింగ్ ట్రస్టీ గా NSశంకర్ వున్నారు.
 
ముఖ్యంగా ఫిలింఛాంబర్ లో వున్న దాసరినారాయణరావు విగ్రహాన్ని పూలమాల వేసే సమయంలో సరైన స్టేజీ లేదు. అదేవిధంగా అక్కడే వున్న రామానాయుడు విగ్రహానికి కూడా స్టేజీ లేదు. కనుక వారం రోజుల్లో ఆ ఏర్పాట్లను పూర్తిచేస్తాం అని మెహర్ రమేష్ తెలిపారు.