Faria Abdulla: సత్య’నుంచి ‘పెళ్లి చూపులు వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం : ఫరియా
Faria Abdullah - Faria Abdullah
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో రాబోతున్న 'గాయపడ్డ సింహం' లో ఫరియా నటించారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేశారు. పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా తోపాటు మానస చౌదరి కూడా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇందులో చాలా మంది దర్శకులు ఉన్నారు వారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?
తరుణ్, జేడీ గారు, పవన్… ఇలా ఇందులో చాలా మంది దర్శకులు ఉన్నారు. వారితో కలిసి పని చేయడం మంచి అనుభవం. సత్య నుంచి పెళ్లి చూపులు వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. జేడీ గారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతారు. అందరూ కశ్యప్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో పని చేశారు.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఇందులో నేను ఒక మంచి క్యామియో రోల్ చేస్తున్నాను. నా పాత్ర పేరు శాలిని. తను ఒక వ్లాగర్. ఇందులో తరుణ్ గారితో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్ గా వచ్చాయి.
-మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కామెడీ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యారెక్టర్ రైటింగ్ చాలా ఫన్నీగా ఉంది. సినిమా చూసిన ఆడియన్స్ కి మళ్లీ చూడాలని అనిపిస్తుంది.
మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది?
కథ విన్నప్పుడు నచ్చితే తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కథ చాలా క్రేజీగా ఉంటుంది. వినగానే కొత్తగా అనిపించింది. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
తరుణ్ భాస్కర్ గారు చాలా సరదాగా ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయన చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేస్తుంది. సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ఉంది.
శ్రీ విష్ణు గారి పాత్ర గురించి?
ఇందులో శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
మానస పాత్ర గురించి?
ఇందులో ఆమె హ్యాండ్ ఇచ్చిన అమ్మాయి…నేను హ్యాండ్ పట్టుకున్న అమ్మాయి.
డైరెక్టర్ గురించి?
కశ్యప్ గారి కామెడీ టైమింగ్ చాలా పెక్కులర్‌గా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను కలిపి హిలేరియస్‌గా తెరకెక్కించారు. ఆయన ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఆయన యాక్టింగ్, డైరెక్షన్ రెండూ అద్భుతంగా ఉన్నాయి.
మ్యూజిక్ గురించి?
స్వీకర్ అగస్తి చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలోని అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. బ్రైడ్ పాట, జింగాల పాట నా ఫేవరెట్స్.
కొత్తగా చేస్తున్న సినిమాల గురించి?
భగవంతుడు రాబోతోంది. అలాగే సిగ్మా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు స్టార్ట్ అవబోతున్నాయి. సత్యదేవ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను.
