1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. We will inflict the damage we need to: Naga Vamsi

Naga Vamsi: మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం : నాగ వంశీ

Suryadevara Naga Vamsi :
Suryadevara Naga Vamsi :
ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆమధ్య ఎగ్జిబీట‌ర్లు, నిర్మాత‌ల గొడ‌వ‌ల్లో నిందలు పడ్డారు. నాగవంశీపై తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాత ఎగ్జిబిటర్ల ఒకాయన.. విగ్, కల్లజోడు పెట్టుకుని వుంటాడు. ఆయనకేమీ తెలుసు అనేంతగా విమర్శించారు. మరోవైపు దిల్ రాజుకూడా ఆయన్ను ఓ ఇష్యూలో విమర్శించారు. అంతకుముందు ప్రతి విషయానికి ఫైర్ అయ్యే ఆయన ఈ ఇష్యూ తర్వాత కాస్త కూల్ గా మారారు. దీనిపై తాజాగా ఓ వీడియో ఇంటర్వ్యూలో నాగవంశీ తన దైన శైలిలో మాట్లాడారు. 
 
‘వాళ్లు డ‌బ్బులు ఉన్న‌వాళ్లు క‌దా, ఏమైనా అంటారు’ వారిని ఎదుర్కోలేం.. అంటూనే.  ‘మేం కంటెంట్ ఓన‌ర్లం. మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం. ఎక్క‌డ చేస్తాం, ఎలా చేస్తాం అనేది చూడాలి. ఇవాల్టితో ఏం అయిపోలేదు. మాకూ టైమ్ వ‌స్తుంది క‌దా.. వార్ మొన్నే మొద‌లైంది..’ సినిమా ఇంకా వుందంటూ తనదైన శైలిలో కౌంటర్ విసిరారు.
 
ఇక నుంచి సినిమాల రిలీజ్ ల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డ‌తామ‌ని, ఏ రెండు పెద్ద సినిమాల్నీ ఒకే వారంలో విడుద‌ల చేయ‌కుండా చూసుకొంటామ‌ని, అప్పుడు థియేట‌ర్ల‌కు ఫుటేజీ అవ‌స‌రం అవుతుంద‌ని, అలాంట‌ప్పుడు నిర్మాత మాటే చెల్లుబాటు అవుతుంద‌న్న అర్థం వ‌చ్చేలా మాట్లాడారు.
 
 అదేవిధంగా లెనిన్ కథను ముందుగా నేను విన్నాను. ఆ తర్వాత అఖిల్ విన్నాడని తెలిసింది. నేను కలిసి సినిమా చేస్తానని చెప్పాను. అప్పుడు నాగార్జున తన స్వంతంగా చేస్తామనీ, చాలా గేప్ తర్వాత వస్తున్నాడు గనుక కేర్ తీసుకోవాలన్నారు. నేను అంతే కేర్ తీసుకుంటానని చెప్పా. ఆయన వెంటనే అయితే ఇద్దరం కలిసి చేద్దాం అన్నారు. అలా సినిమా సెట్ అయింది.
 
అయితే షూటింగ్ లోనూ పోస్ట్ ప్రొడక్షన్ లోనూ ఆయన ప్రమేయం వుంది. నేనుకూడా బాధ్యతగా చేశాను. ఇక 'పెద్ది' విష‌యంలో ఏం జ‌రిగింది?  ప‌ర్సంటేజీ ఎంత ఇచ్చారు?  అస‌లు ప‌ర్సంటేజీ వ‌ల్ల లాభ‌మెంత‌, న‌ష్ట‌మెంత‌? అన్న ప్రశ్నకు దాటవేస్తూ అవన్నీ ఇప్పుడు ఎందుకు.. లెనిన్ పబ్లిసిటీపైనే ఫోకస్ పెట్టానన్నారు.
About Writer
దేవీ