డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏం చేశాడు
Tharun Bhascker, Faria Abdullah
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించిన ఈ టీం, ఇప్పుడు ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ను విడుదల చేశారు.
చిన్నప్పటి నుండి అమెరికాకు వెళ్లాలని కలలు కనే ఒక యువకుడి కథ ఇది. అతని కోరిక చివరికి నెరవేరుతుంది, ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్తాడు. కానీ అతని ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్‌ను ప్రకటిస్తాడు. ఈ కష్టాన్ని హీరో ఎలా ఎదుర్కొంటాడు, మనుగడ కోసం ఎలా పోరాడతాడు అనేది కథ ప్రధానాంశం.
కశ్యప్ శ్రీనివాస్ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాన్ని అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఈ ట్రైజర్ ఒక భారతీయ కోణం నుండి అమెరికన్ డ్రీమ్‌పై ఒక సెటైరికల్ నరేటివ్ ని ప్రజెంట్ చేస్తుంది. కేజీఎఫ్ తరహా ప్రెజెంటేషన్, పెళ్లిచూపులు తరహా కామెడీ కలగలిసి మరింతగా అలరించాయి.
తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్ అలరించారు. ఈ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఫరియా అబ్దుల్లా,శుభలేఖ సుధాకర్ కథను కేజీఎఫ్ తరహాలో వివరించ నవ్వులని పంచింది. మానస చౌదరి తరుణ్ లవర్ పాత్రలో నటిస్తుంది. విష్ణు ఓయ్ అతని స్నేహితుడిగా కనిపించారు.
విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ, స్వీకర్ అగస్తి సంగీతం సినిమా మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. విప్లవ్ నైషధం ఎడిటర్, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైనర్, కథను సూర్య ప్రకాష్ జ్యోసుల రాశారు.
2026 వేసవిలో సినిమా విడుదల అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. సరదాగా సాగే ఈ ట్రైజర్ తో తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొంతమందికి అమెరికా వెళ్లాలని లక్ష్యం ఉంటుంది. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది వున్నారు. కానీ వీసాలు చాలాసార్లు రిజెక్ట్ అవుతుంటాయి. దానికి చాలా నవ్వుకునే కారణాలు ఉంటాయి. నిజంగా అదొక ప్రపంచం. ఇలాంటి కథతో కశ్యప్ వచ్చినప్పుడు ఆ కథ చెప్పినప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఆ యూనిక్ ట్రీట్మెంట్ కి ఫిదా అయిపోయాను. ఆడియన్స్ కూడా ఫిదా అవుతారని నమ్మకం ఉంది.కశ్యప్ చాలా యూనిక్ వాయిస్ ఉన్న డైరెక్టర్. తన సెన్సాఫ్ హ్యూమర్ చాలా యూనిట్ గా ఉంటుంది. తనకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. స్క్రీన్ లో చూసినప్పుడు నవ్వుతూనే ఉంటారు. మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. పవన్ తను ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాడు.తను సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాచేయడం ఒక మంచి అవకాశం గా భావిస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ధియేటర్లో లాఫ్ రైడ్ ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఫారియాతో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఒక డాన్స్ నెంబర్ ఉంది. అందులో నాకు చాలా హెల్ప్ చేసింది. చాలా మంచి సినిమా. ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను.