ఆదివారం, 15 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026 (17:29 IST)

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

Gayapadda Simham, Tharun Bhascker
Gayapadda Simham, Tharun Bhascker
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్ , జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ రోజు, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే  పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు.
 
'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా మూడ్, నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తోంది. అమెరికన్ శైలిలో ఉన్న ఎరుపు-తెలుపు రంగుల బొమ్మలతో నిండిన ఈ డిజైన్‌లో, అమెరికా జెండాను గుర్తుచేసే నక్షత్రాలు, నిలువు గీతల నేపథ్యంలో దూసుకుపోతున్న విమానం కనిపిస్తుంది. పాస్‌పోర్ట్ స్టాంప్ ఒక సాహసోపేతమైన, సెటైరికల్ కథనాన్ని సూచిస్తుంది.
 
రివాల్వర్,  డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్న క్యారికేచర్,  నటరాజ కాంపస్ బాక్స్ ఇవన్నీ ఆసక్తికరంగా వున్నాయి.  ఈ అంశాలు పొలిటికల్ సెటైర్, క్రైమ్, హాస్యం కలగలిసిన ఎంటర్టైనర్ ని సూచిస్తున్నాయి.    "నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!"అనే ట్యాగ్‌లైన్ మరింత హిలేరియస్ గా వుంది. టీజర్ ఫిబ్రవరి 9న విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా, విష్ణు ఓయి, హర్షవర్ధన్ ,శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీని, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు, విప్లవ్ నైషధం ఎడిటర్  ప్రొడక్షన్ డిజైన్ చంద్రిక గొర్రెపాటి, కథను సూర్య ప్రకాష్ జ్యోసుల అందించారు.
 
ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.