సంబంధిత వార్తలు
- Manasa Sharma: ఫాంటసీ, అడ్వెంచర్లతో తీసిన రాకాస కొత్తగా ఉండబోతుంది : మానస శర్మ
- Vijay Sethupathi: మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం గాంధీ టాక్స్ ట్రైలర్
- Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్
- Mrunal Thakur: ధనుష్ తో పెండ్లి వార్తను ఖండించిన మ్రుణాల్ ఠాగూర్?
- ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో గాంధీ టాక్స్ విడుదలకు సిద్ధమవుతోంది
కోటలోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? ఆసక్తిగా రాకాస ట్రైలర్
Manasa Sharma, Sangeeth Shobhan, getup srinu
*ట్రైలర్‌ను గమనిస్తే.... ఆ కోటలో ఉన్నది.. ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు.. భీకర బ్రహ్మ రాక్షసుడికి అనే డైలాగ్‌తో రాకాస ట్రైలర్ ప్రారంభమవుతుంది. దానికి అనుగుణంగా చూపించే పురాతనమైన కోట.. బ్రహ్మ రాక్షసుడు ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
భయంతో నడుస్తున్న గెటప్ శీను ఓ పిల్లాడు చేసిన బూర సౌండ్‌కి జడుసుకుంటాడు. వెంటనే నువ్వు పెద్ద డిఎస్‌పి అనుకుంటున్నావా? లోపలకిపో..కోతి నాయాలా! అని తిడతాడు. హీరో సంగీత్ శోభన్, నయన సారికల మధ్య ఉన్న ప్రేమ.. హీరో, హీరోయిన్‌కు మధ్య ఉన్న సీన్స్‌ను చూపిస్తూ వారి మధ్య ఉన్న లవ్ యాంగిల్‌ను రివీల్ చేశారు.
బస్సులో సంగీత్, తనికెళ్ల భరణి, గెటప్ శీను మధ్య వచ్చే కామెడీ సీన్ ఆకట్టుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ సంగీత్‌ను ఉద్దేశించి రాత్రి ఏం జరిగింది? అని అడిగితే..పడుకోవడం లేటయ్యింది అని కామెడీగా సమాధానమిస్తాడు. వేళాకోళంగా ఉందా? నా హిస్టరీ నీకు తెలియదు అని బ్రహ్మాజీ సంగీత్‌తో అంటే.. ఏం డిలీట్ చేస్తారా? అని ఇచ్చే ఫన్నీ కౌంటర్ ఆకట్టుకుంటోంది.
ఊరుకొచ్చినప్పటి నుంచి నా జీవితం ఎటేలుతుందో తెలియటం లేదు అని హీరో టెన్షన్ పడటం..దానికి తోడు ట్రైలర్లో చూపించే ఉల్క పతనం..రాత్రికి రాత్రి పశువులు కలేబరాలుగా మారటం చూస్తే ఊర్లో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
ఊరు బతికి బయటపడాలంటే బలి పంపాల్సిందే అంటూ తనికెళ్లభరణి చెప్పటం..కోటకు సంబంధించిన తాళాన్ని చూపించటం చూస్తే కోటకు, ఊరుకి మధ్య ఏదో లింకు ఉందనేది అర్థమవుతుంది. ట్రైలర్ చివరలో ఈమాత్రం దానికేనా.. లోపల నీకుంటది అసలైన మ్యూజిక్ అనటంతో.. బ్రహ్మ రాక్షసుడు ఉండే కోటలోకి హీరో సంగీత్ ఎంట్రీ ఉంటుంది.. ఆ కోటలోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న రాకాస సినిమా చూడాల్సిందేనని ఆసక్తి రెట్టింపు అయ్యింది.
