ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో
తన ఒక్క ఓటును తొలగిస్తే 10 మంది ఓటర్లను ప్రభావితం చేసి కేంద్రంలో వున్న ప్రభుత్వాన్నే పడగొడతానంటున్నారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. పైగా తన ఓటు కోసం ప్రభుత్వ ఆఫీసుల వద్ద భిక్షగాడిలో క్యూ నిలబడి మార్చుకోవాల్సిన అవసరం లేదనీ, ఓటరు చిరునామా మార్చాల్సినవారు ఇంటికి వచ్చి నమోదు చేసుకుని మార్చాలని అంటున్నారు. వాస్తవానికి ఓటరు చిరునామా మార్పు కోసం ప్రతిచోట సిబ్బంది ప్రతి ఇంటికి తిరుగుతూనే వున్నారు.
మరి ఈ విషయం ప్రకాష్ రాజ్ దృష్టికి వచ్చిందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇవన్నీ వదిలేసి ఓటరు చిరునామా విషయాన్ని భూతద్దంలో పెట్టి రాద్దాంతం చేయడం హాస్యాస్పదంగా వున్నదని పలువురు విమర్శిస్తున్నారు. బాధ్యత ప్రభుత్వాలకు వుంటుంది కానీ మన ఇష్టం వచ్చినట్లు ఇష్టమున్న చోటకి అద్దెకి మారినప్పుడల్లా సిబ్బంది మన చిరునామాలు మార్చేందుకు మన వెంట పరుగులు తీస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Clear message to government
— Cockroaches of India (@CJP_for_India) August 15, 2026
Reporter: What happened in your case after Karnataka SIR?
Prakash Raj Sir: I changed my house, not my country. How can you mark a voter “absent” or “shifted” and quietly push him out?
Reporter: But they say it is only verification.
Prakash: Then… pic.twitter.com/dt4s5kwBms
ఇంతకీ ప్రకాష్ రాజ్ ఓటరు ఐడీ కార్డుల గొడవేమిటి?
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కి 4 వేర్వేరు రాష్ట్రాల్లో ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయని బెంగుళూరు కోర్టులో లీగల్ ఫిర్యాదు దాఖలైంది. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి దేశంలో ఒకే ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు ఉండేందుకు అనుమతి ఉంది. న్యాయవాది దిలీప్ కుమార్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ప్రకాష్ రాజ్‌కు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటరు కార్డులు ఉన్నట్లు ఆరోపించారు.
ఈ బహుళ ఓటరు కార్డుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు సమన్లు పంపినా హాజరు కాకపోవడంతో బెంగళూరు కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, ఆ తర్వాత ఆయన బెయిల్ పొందారు. కర్ణాటకలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో బెంగళూరులోని ఆయన ఓటు నమోదు ఉన్న చిరునామాలో ఆయన నివసించడం లేదని తేలడంతో, ఎన్నికల అధికారులు ఆయన ఓటును "షిఫ్టెడ్" (వేరే ప్రాంతానికి మారారు) జాబితాలో చేర్చారు.
