బుధవారం, 12 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2025 (13:15 IST)

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

Nayanthara As Shasileka
Nayanthara As Shasileka
మెగాస్టార్ చిరంజీవిని మన శంకర వర ప్రసాద్ గారు (MSG) అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అభిమానిగా ఆయన నటించిన చిత్రాల స్పూర్తితో ఓ కథను రాసుకున్నారు. అయితే చిరంజీవి పేరును రియల్ గా పెట్టిన దర్శకుడు ఆయన ప్రేయసిగా శశిరేఖగా నయనతారను నటింపజేశారు. మరి ఈ శశిరేఖ ఎవరు? అనేది అభిమానుల్లో దర్శకుడు ఆసక్తి కలిగించేలా చేశాడు. అందుకే విజయదశమి పండుగ నాడు ఆమె స్టిల్ ను రిలీజ్ చేస్తూ పసుపురంగ చీరతో అందంగా కనిపించేలా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
 
చిరంజీవిని స్టయిలిష్ గా వినోదాత్మకంగా చూపించే లా చిత్రం వుంటుందని దర్శకుడు తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు, షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి స్పెషల్‌గా విడుదల కానుంది. సుష్మ కొణిదెల, అర్చనా ఎస్.క్రిష్ణ సాంకేతిక వర్గం.