Shivaji: ఇక పై ఆంధ్ర సినిమా కనుమరుగు - తెలంగాణ సినిమా దే పైచేయి కానుందా !
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ గా రాజకీయ నాయకులు పాలన చేస్తున్నారు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలు తగ్గిపోయాయి. తెలంగాణా సినిమాలు నిర్మానంలో ఊపందుకుంటున్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆంధ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు కోట్లు వెచ్చించి సినిమాలు తీస్తున్నారు. కాని కొన్ని మినహా సినిమాలు పెద్దగా ఆడడంలేదు. ఆంధ్ర కథలు కూడా తగ్గిపోయాయి. గతంలో రచయితలూ మంచి కథలు రాసేవారు. ఇప్పుడు రాయడానికి సరియైన వారు లేదు. దానితో ఓ ఖాలీ వచ్చింది.
దానిని తెలంగాణ సినిమా అవకాశాలు రాబట్టుకుంటుంది. మారు మూలాన కథలు వెండి తెరపై దర్శనమిస్తున్నాయి. బలగం కు ముందు కూడా కొన్ని సినిమాలు వచ్చినా బలగం సినిమా తర్వాత మరిన్ని సినిమాలు సాంకేతికత, నటినటులు వెలుగులోకి వస్తున్నారు. రాజు రంబాయి, దండోరా తో పాటు పదుల స సంఖ్యలో కథలు వస్తున్నాయి. దానిపై నటుడు శివాజీ మనసులో మాటను తెలిపారు.
నేనే కాదు, చాల మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర లో సినిమా కథలు పెద్దగా రావడం లేదు. కోర్ట్ అనే సినిమా వచ్చింది. కాని ఇప్పుడు తెలంగాణ సినిమాలే ఎక్కువ అయ్యాయి. సినిమా లే లేదు, వెబ్ సిరిస్ కూడా తెలంగాణ కధలే వస్తున్నాయి.ఒటిటి లు కూడా తెలంగాణ కదలే అడుగుతున్నారు. అందుకే సినిమా రంగంలో రాబోయో 10 ఏళ్లలో పెద్ద మార్పు రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ హోదా లేదు, పారితోషికం భారి సినిమాలు ఉండవు. మలయాళ సినిమా తరహాలో సింపుల్ సినిమాలు వస్తున్నాయి.
కనుక, ఆంధ్ర ప్రభుత్యం ఆలోచించి తగు నిర్ణయం చేయాలి. ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటా తెలంగాణ లోనే ఉంది. ఆంధ్ర లో లేదు. కనుక డెవలప్మెంట్ ఇక్కడే ఉంటుంది. ఆంధ్ర లో సరియన వసతులు, స్టూడియో లు లేవు. సిబ్బంది లేరు. తెలంగాణ లో రామోజీ తో పాటు పలు స్టూడియోలు, సాంకేతిక నైపుణ్యం ఇక్కడే ఉంది. ఇంటర్ నేషనల్ ఫెస్టివల్స్ ఇక్కడే జరుగుతాయి. కాబట్టి కనివినీ ఎరుగని రీతిలో తెలంగాణ సినిమా ముఖ చిత్రం మారిపోతుంది. ఆంధ్ర పాలకులు సినిమా గురించి ఆలోచించక పోతే సినిమా కనుమరుగు అవుతుంది. అని తెలిపారు.