మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 9 ఫిబ్రవరి 2026 (10:30 IST)

K.V. Anudeep: కె.వి. అనుదీప్ కు ఫంకీ మరో జాతిరత్నాలు అవుతుందా ?

KV Anudeep and his team
KV Anudeep and his team
ఫంకీ ట్రైలర్ తో నవ్వుల మోత మోగించిన విశ్వక్ సేన్ అంటూ దర్శకుడు కె.వి. అనుదీప్ కాంప్లిమెంట్ ఇచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కథానాయిక నటించిన సినిమా అది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా 2019లోని ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలోపోస్ట్ చేశారు.
 
2019 లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న రోజుల్లో నానిగాడు అన్నయ్య కాల్ చేశాడు..రేయ్ మురళి..ఒక డైరెక్టర్ కథ చెప్తాడు, విని ఎలా ఉందో మనస్పూర్తిగా చెప్పు అన్నాడు.. ఆరోజు మధ్యాహ్నం "కృష్ణకాంత్ పార్క్ లో అతను బేటా బేటా అంటూ కథ చెప్తున్నాడు,  నేను కిందపండి దొర్లుతూ నవ్వుతున్నాను, చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను అదోలా చూశారు, ఆ తరువాత ఆ జోక్స్ ను మా ఊరు వెళ్ళినప్పుడు పిల్లలతో చెప్పేవాడిని, వాళ్ళు కూడా నవ్వేవారు, ఈలోపు కరోనా వచ్చింది, మొత్తానికి షూటింగ్ అయింది, సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ అయింది.. ఆ సినిమా పేరు జాతిరత్నాలు. ఆ దర్శకుడు అనుదీప్ కె.వి. అన్నయ్య. తలుచుకుంటే ఇప్పటికీ గొప్పగా గర్వంగా అనిపిస్తుంది.. ఈ నెల 13 న ఫంకీ రిలీజ్ కాబోతుంది.. భీభత్సమైన హిట్ అవుతుంది..కంగ్రాట్స్ వంశీ, విశ్వక్ సేన్..అంటూ దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు.