Kalki 2: ప్రభాస్ పుట్టినరోజు తర్వాత కల్కి సీక్వెల్ ముంబైలో జరగనుంది ?
Updated: Fri, 16 Oct 2026 (18:16 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఫౌజీ చిత్రం షూటింగ్ జరుగుతోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ కూడా జరుగనుంది. ఇంకోవైపు కల్కి 2 కూడా చేయనున్నారు. తాజా సమాచారం మేరకు ప్రభాస్ పుట్టినరోజు ఈనెల 23వ తేదీ. సింపుల్ గా వేడుకను హైదరాబాద్ లో జరపుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కల్కి 2 షూటింగ్ ముంబైకి మారనుండగా, అది ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమా కల్కి 2 ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుని షూట్ కి సిద్ధం అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూట్ ఈ నవంబర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ లో టేకాఫ్ కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ ప్లాన్స్ కోసం ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటి ప్రకారం మేకర్స్ టార్గెట్ 2028 విడుదల చేయనున్నారని చెబుతున్నారు. ఇప్పుడు నుంచి వచ్చే ఏడాదిలో షూట్ ని పూర్తి 2028 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే కల్కి పార్ట్ 1 విడుదల నాటికే పార్ట్ 2 పనులు కూడా చాలా అయ్యాయి. సో 2028 లో పక్కా విడుదల ఉంటుంది అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి