Ravi Teja: సునీల్ తో దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు : రవితేజ
Ravi Teja, Dimple Hayathi, Ashika Ranganath
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ... మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ళ. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృద్వి ఇందులో ఎంటర్ టైనింగ్ గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్ తో చేశారు.
ఇందులో సునీల్ తో మళ్ళీ దుబాయ్ శీను లాంటి ఫన్ చూడబోతున్నారు. సత్య కిషోర్ మురళీధర్ గారు గెటప్ శీను సోని అందరు కూడా అద్భుతంగా చేశారు. వీళ్ళతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబి, కిషోర్.. వీరి డైరెక్షన్లో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. నెక్స్ట్ శివ నిర్వాణతో చేస్తున్నాను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. హీరోయిన్స్ చాలా బ్రహ్మాండంగా నటించారు. మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రమోషన్స్ లో డాన్స్ ఇరగదీసారు. ఈ సినిమాకి టైటిల్ మా పవన్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్ గా ఉంటుంది. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్స్ లో కలుద్దాం.
డింపుల్ హయాతి మాట్లాడుతూ, రవితేజ గారితో ఇది నాకు రెండో సినిమా. ఆయనతో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది డైరెక్టర్ గారు సినిమాని అద్భుతంగా తీశారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది
హీరోయిన్ ఆశిక రంగనాథ్ మాట్లాడుతూ, విక్రమార్కుడు లో ఆయన రెండు క్యారెక్టర్స్ ని ప్లే చేసిన ప్లే చేసిన విధానం చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అలాంటి సూపర్ సార్ తో నేను నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది చాలా వండర్ఫుల్ జర్నీ. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు.