Balakrishna: నా పేరు నిలబెట్టావ్ అన్నారు బాలయ్య గారు : హీరో శర్వా
Sharwa, Ram Abbaraju, Srivishnu, Anil Sunkara
శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ నారీ నారీ నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు.
శర్వా మాట్లాడుతూ, ఈ టైటిల్ ఇచ్చి ముహూర్తం పెట్టిన మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్ననే బాలయ్య గారితో మాట్లాడాను. నా పేరు నిలబెట్టావ్ అన్నారు. నెక్స్ట్ సినిమా నుంచి మీరే ముహూర్తం పెట్టాలని అడిగాను. ముందుగా శ్రీ విష్ణు గారికి థాంక్స్. చివర్లో కామియో రోల్ చేయడం శ్రీ విష్ణు గారి గొప్ప మనసు. ఒక హీరో సినిమాని ఫ్రెండ్షిప్ ని నమ్మి చేయడం అనేది మామూలు విషయం కాదు. అనిల్ గారి ప్రొడక్షన్స్ లో మా ఇద్దరికి కలిసి ఒక కథ రాస్తే తప్పకుండా చేస్తాం. చిన్ని గారితో పదేళ్ళ ఏళ్ల అనుబంధం. ఆయనతో సినిమా చేయాలి. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది.
అనిల్ గారికి థాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. హీరో ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుందనేది మేము చూపిస్తాం. నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను. మళ్ళీ అనిల్ గారు పెద్ద సినిమా చేసే వరకు రూపాయి కూడా తీసుకోను. ఇది నా ప్రామిస్. ఎందుకంటే హిట్ వాల్యూ మాకు తెలుసు. అలాంటి హిట్ ఆయన నాకు ఇచ్చారు. ఆడియన్స్ అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు సో మచ్
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. నారీ నారీ నడుమ మురారి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్. ఈ టైటిల్ అనగానే నాకు టెన్షన్ వచ్చింది. బాలయ్య బాబు గారి ప్రతిష్టాత్మకమైన సినిమా అది. అలాంటి టైటిల్ పెట్టాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. అనిల్ గారు శర్వా సాయి ఆ ధైర్యం చేశారు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అనిల్ గారికి హిట్స్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చాలా మంచి మనిషి. అందరికి బిగ్ కంగ్రాజులేషన్స్.శర్వా నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆయన చాలా మర్యాదగా మాట్లాడుతారు. చాలా డిఫరెంట్ కథలు చేస్తారు. ఆయన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. ఆయన ప్రతి సంవత్సరం పండగకి రావాలని కోరుకుంటున్నాను. ఆయన వస్తే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ థాంక్యూ.
ప్రొడ్యూసర్ అనిల్ సంకర మాట్లాడుతూ, సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ అప్పుడు ఈ షీల్డ్స్ ఇచ్చాము. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సక్సెస్ కి షీల్డ్స్ ఇవ్వడమనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది అందరూ మెచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రశంసలు అందుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.శర్వా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మొదటి నుంచి నమ్మకంగా చెప్పారు. ఆ నమ్మకం నిజమైంది. నెక్స్ట్ సంక్రాంతికి ఆయన మళ్లీ వస్తున్నారు. ఆయన రావాలని అందరు కోరుకుంటున్నారు. ఎందుకంటే శర్వా వస్తే ప్రతి సినిమా హిట్ అయిపోతుంది.రైటర్స్ భాను నందు మా జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నరేష్ గారు ఈ సినిమా సామజ కంటే పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు. ఆయన సీన్స్ కి థియేటర్స్ లో పడి పడి నవ్వుతున్నారు. మా డిస్టిబ్యూటర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. యుఎస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విష్ణు కామియో అద్భుతంగా చేశారు. ఈ విజయంతో మరింత బాధ్యత పెంచుకుని నెక్స్ట్ వచ్చే సినిమా ఇంతకంటే బెటర్ గా ఉండాలని కోరుకుంటున్నాను.