1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. YouTuber Prashna Ravan is facing fresh legal trouble as a new case

'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు

prashna ravan
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనకు మావోయిస్టులతో గట్టి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. యువత, విద్యార్థులను రావణ్‌ రెచ్చగొడుతున్నాడని.. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయన్నారు.
 
'నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించేలా రావణ్‌ ప్రకటనలు చేస్తున్నారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతడి తీరు కనిపిస్తోంది. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం ఉంది. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో రెచ్చగొట్టేలా రావణ్‌ మాట్లాడారు. అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పదవుల్లో ఉన్నవారిని దూషించారు. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టిస్తున్నారు. 
 
మావోయిస్టు భావజాలాన్ని అతడి ఫోన్‌లో గుర్తించాం. మావోయిస్టు హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రావణ్‌ పేరు పెట్టుకోవడం కూడా అందులో భాగమే. అతడికి సహకరిస్తున్నవారెవరో తేల్చాల్సి ఉంది. విచారణకు నిందితుడు సహకరించడం లేదు'’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 
 
మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్‌పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం అర్థరాత్రి అరెస్టు చేశారు. 
 
దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బీఎన్‌ఎస్‌లోని 152 సహా పలు సెక్షన్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని (ఉపా) సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్‌ విధించారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రామాయణంలో శ్రీరాముడి తొలి లుక్‌కు వెనుక ఉన్న ఆభరణాలను ఆవిష్కరించిన ట్రైబ్ అమ్రపాలి