1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Yuzvendra Chahal-Taniya Chatterjee Controversy: Actress Alleges Cute DM, Viral Video Sparks Debate

ఆప్ క్యూట్ హో... మోడల్ తాన్యా ఛటర్జీకి చాహల్ మెసేజ్ (Video)

taniya chatterjee
భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ మరోమారు వార్తలకెక్కాడు. అయితే, ఇపుడు క్రికెట్ మైదానంలో రాణించి మాత్రం కాదు. తన ఇన్‌స్టా ఖాతాలో బాలీవుడ్ నటి, మోడల్ తాన్యా చటర్జీకి ఓ క్యూట్ మెసేజ్ పంపించాడు. దీనిపై మోడల్ చేసిన ఆరోపణలు ఇపుడు సోషల్ మీడియాలో పెను దుమారం రెపుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడేసినందుకు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. తాజాగా బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీ చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తూ వివాదంలో చిక్కుకున్నాడు. 
 
'గందీ బాత్', 'తిల్లియాన్' వంటి ఓటీటీ షోలతో గుర్తింపు పొందిన తాన్యా ఛటర్జీ, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌ను చూపించింది. తన స్టోరీకి చాహల్ స్పందిస్తూ 'ఆప్ క్యూట్ హో' (మీరు క్యూట్‌గా ఉన్నారు) అని మెసేజ్ చేశాడని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అయింది. అయితే, తాన్యా ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
 
ఈ వివాదం తెరపైకి రావడానికి కొద్ది రోజుల ముందే చాహల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. కారు నడుపుతూ సిగరెట్ తాగి, దానిని రోడ్డుపై పడేస్తున్నట్లుగా ఉన్న ఓ వ్యక్తి వీడియో వైరల్ కాగా, ఆ వీడియోలో ఉన్నది చాహలేనంటూ అభిమానులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.
 
చాహల్ వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. 2025లో అతను తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆర్జే మహ్వాష్‌తో అతను సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా, కొన్నాళ్లకే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఆ ప్రచారానికి తెరపడింది. 

 
About Writer
PNR
తర్వాతి కథనం
Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ ఈతరం జెన్ జీ కిడ్స్ కు బాగా నచ్చుతుంది : వి. మునిరాజు