1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. A Decent Film That Delivers Entertaining Scares: Rakasa – Review

Rakasa Review: భయపెట్టి వినోదాన్ని పంచే డీసెంట్ చిత్రం రాకాస - రాసాక రివ్యూ

Sangeeth Shobhan, Nayan Sarika, Getup Srinu
Sangeeth Shobhan, Nayan Sarika, Getup Srinu
నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం : ఎదురోలు రాజు, సంగీతం : అనుదీప్ దేవ్, నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్, కూర్పు : అన్వర్ అలీ, దర్శకత్వం : మానస శర్మ.
 
నిహారిక కొణిదెల నిర్మాణంలో  మానస శర్మ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తీసిన సినిమా రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.. టీజర్, ట్రైలర్ లతో హార్రర్ సినిమా అని చెప్పేశారు. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
ఓ ఊరిలో రాజుల కాలంనుంచి జరిగిన కథ ఇది. 2వేల సంవత్సరాలనుంచి ఆ ఊరిలోని కోటలో ఓ బ్రహ్మ రాక్షసుడి ఇచ్చిన సంకేతాల ప్రకారం ఊరినుంచి ఒకరు రాక్షసుడికి బలిగా పంపుతూ వుంటారు. అలా 2026 నాటికి కథ వస్తుంది. అదేఊరిలో పుట్టిపెరిగిన వీరబాబు  (సంగీత్ శోభన్) విదేశాలకు వెళ్ళి సంపాదించుకుని తను ప్రేమించిన అమ్మాయిని పెండ్లిచేసుకోవాలని వస్తాడు. తీరా వచ్చాక మరొకరితో పెండ్లిచేసుకుంటుందని తెలిసి షాక్ కు గురవడమేకాకుండా ఎలాగైనా ఆ అమ్మాయిని చేసుకుకోవాలని ట్రై చేస్తాడు. ఆ క్రమంలో ఊరిలోనే చిన్ననాటి స్నేహితురాలు ఊరి ఆచారి కూతురు నయన్ సారిక ప్రేమకు దగ్గరవుతాడు.
 
ఇదిలా వుండగా, ఊరి కోటలో వున్న రాక్షసుడు కి బలిగా వీరబాబు స్నేహితుడు గెటప్ శీను వంతు వస్తుంది. ఊరి పెద్ద పంచాయితీ తీర్పును వ్యతిరేకించి ఇదంతా మూఢనమ్మకమని దాన్ని ఛేదించేందుకు తనే వెళతానని మాటజారతాడు. అలా వీరబాబు కోటలోకి ప్రవేశించాల్సివస్తుంది. ఇక ఆ తర్వాత కోటలో జరిగే వింతలు విశేషాలే మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
ఓ ఊరు. కట్టుబాట్లు, దెయ్యం ఇలాంటి కథలు చాలా వచ్చాయి. రాక్షసుడు అనే కాన్పెప్ట్ తో రాకాస సినిమాగా రూపొందింది. అయితే ఎక్కడా పాత సినిమా ఛాయలు కనిపించకుండా నీహారిక మనసుపెట్టి విన్న కథను అంతే మనసుపెట్టి మానశ శర్మ తీసిందనే చెప్పాలి. కథ ఆద్యంతం ఎంటరట్ టైన్ మెంట్ తో థ్రిల్, హార్రర్ అంశాలతో లాజిక్ గా తీయడం విశేషం. దర్శకురాలు కామెడీని, థ్రిల్లింగ్ మూమెంట్స్ ని మిక్స్ చేసిన విధానం బావుంది
 
చిత్రంలోని ప్రధాన పాత్ర సంగీత్ శోభన్ భుజాన మోశాడనే చెప్పాలి. అమాయకత్వంతోపాటు వాగుడుకాయలా వాగుతూ వుండడం కూడా నవ్వు తెప్పిస్తుంది.  తన స్పీడ్ డైలాగ్ లకు అనుగుణంగా హావభావాలు పలికిస్తూ ఎక్కడా బోర్ లేకుండా చేశాడు. దానికితోడు  కామెడీ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. తనకు బావ.. అంటూ తోడుగా వుండే గెటప్ శీను పాత్ర ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వెన్నెలకిశోర్ తో కోటలో సాగే సన్నివేశాలు మరింత ఆకట్టుకునేలా వుంటాయి. వెరసి హాయిగా నవ్వుకునే క్లీన్ కామెడీ సినిమాగా వుంది.
 
ఇక మిగిలిన పాత్రలు తనికెళ్ళభరణి, ఆవిష్ విద్యార్థి, బ్రహ్మాజీ పాత్రలు పరిధి మేరకు వున్నాయి. రాక్షసుడిగా నటించిన నటుడు ఆహార్యానికి తగినట్లుగా వున్నాడు. కథానాయిక నయన్ తో సాగే సన్నివేశాలు కూడా అలరిస్తాయి. చివరిలో చిన్న ట్విస్ట్ కూడా థ్రిల్ కలిగిస్తుంది.
 
సాంకేతికంగా చూస్తే, రాజకోట కూడా పాత్రగానే పరిగణించాలి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ తీరు బాగుంది. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కథలో భాగంగా వున్నాయి.  ప్రొడక్షన్ డిజైన్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. 
 
ఇక ఇలాంటి ఫాంటసీ టచ్ ఉన్న సబ్జెక్ట్ లో రాక్షసుడిలోని మానవ కోణం కూడా చూపిస్తూ దర్శకురాలు చేసిన ప్రయత్నం మెచ్చదగిందే. అయితే ఆ క్రమంలో చిన్నపాటు లోటుపాట్లు వున్నా అవేవి పెద్దగా కనిపించకుండా తను జాగ్రత్త పడిందనే చెప్పాలి.  ప్రేక్షకులను భయపెట్టి, కాసేపు ఎంటర్ టైన్ చేసే కోణంలో ఈ చిత్రం తీశారనే చెప్పారు. వేసవిలో కుటుంబం అంతా కలిసి చూసే సినిమాగా రూపొందిన ఈ సినిమాకు  నిహారిక ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. గ్రాండ్ లెవల్ లో సినిమా ప్రొడ్యూస్ చేశారు. అయితే పబ్లిసిటీ సాంగ్ గా చివరిలో వచ్చిన పాటను కథనంలో మధ్యలో డ్రీమ్ సాంగ్ గానో పెడితే ప్రేక్షకులు కాసేపు ఆటవిడుపుగా అనిపించేది. అన్వర్ అలీ ఎడిటింగ్ కూడా ఓకే కానీ కొన్ని సీన్స్ లో మాత్రం అక్కడక్కడా ఫ్రేమ్స్ మిస్ మ్యాచ్ అయినట్టు కనిపిస్తుంది.
 
ఫైనల్ గా చెప్పాలంటే, వినోదంతోపాటు భయాన్ని కలిగిస్తూ ప్రేక్షకులను అలరించే చిత్రంగా చెప్పవచ్చు. దర్శకురాలిగా తన ప్రతిభను చూపించడానికి ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఎక్కడా వల్గారిటీ లేకుండా తీయడం విశేషం.
రేటింగ్ : 3/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
ఆ డ్రగ్ పార్టీలో నేనూ ఉన్నాను.. డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది : నటి హేమ