1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. A movie review featuring a unique concept: Aliens and the Present

First Time Review: : ఏలియన్స్ అండ్ వర్తమానం అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఫస్ట్ టైమ్ మూవీ రివ్యూ

First Time movie poster
First Time movie poster
పరిమిత బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఫస్ట్ టైమ్. సౌరభ్ ధింగ్రా హీరోగా నటించిన చిత్రం. అనికా విక్రమన్ హీరోయిన్‌. అన్నపూర్ణమ్మ, మైమ్ గోపి, అజయ్ రత్నం, గాయత్రి గుప్త తదితరులు నటించారు. హేమంత్ ఇప్పలపల్లి తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ గా రూపొందిన ఈసినిమా నేడే విడుదలైంది. మరి ఎలా వుందో తెలుసుకుందాం.
 
కథ:
ఈ సినిమా కథ ఒక కాలం నాటిది. క్రీస్తు శకం 2304 (2304 AD)లో ప్రారంభమవుతుంది. ఆకాశం నుంచి ఊడిపడిన గ్రహాంతరవాసి జంట ఓ దీవిలో దిగి ఇక్కడ మనం కొత్త ప్రపంచాన్ని స్రుష్టిద్దామని అనుకుంటారు. వారి ఆలోచనలు పసిగట్టిన ఆత్మలాంటి ఆకారంలో వున్న కొందరు వచ్చి వారిని తమ గురువుదగ్గరకు తీసుకెళతారు. అక్కడ నుంచి కథ వర్తమానంలోకి వస్తుంది. 
 
2026 వర్తమానం లో ఓ అమ్మాయిని పాడుచేయాలని కొందరు ప్రయత్నిస్తారు. ఆమె అనికా విక్రమన్‌.  ఆమె బావ భూపాల్ రాజు, మరో విలన్ శివకుమార్ రామచంద్రవరపు, అలాగే అఖిల్ సార్థక్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారినుంచి తప్పించుకునే క్రమంలో సౌరభ్ ధింగ్రా పరిచయం కావడం జరగుతుంది. ఆ తర్వాత కథ మరో లోకంలోకి వెళుతుంది. అది ఏమిటి? కరోనా నుంచి అంతకంటే భయంకరమైన వ్యాధి వస్తే భూమండలం ఏమవుతుంది? అనే కాన్సెప్ట్ తో ఎలా చెప్పాడు అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
సినిమా మొదటినుంచి భారీ సినిమా చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. ప్రారంభంలోనే ఇది ఎ.ఐ. కాదు. హెచ్.ఐ. అంటూ స్టయిడ్ వేశారు. తమకున్న ఒనరులతో టెక్నికల్ తో చేశామని చూపించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే ఆధారపడకుండా, మానవ మేథస్సుకు (Human Intelligence) విజువల్ పవర్‌ను జోడించి దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఈ ఫస్ట్ టైమ్ సినిమాను తెరకెక్కించారు.

గ్రహాంతరవాసులు భూలోకంలోకి వస్తే ఎలా ఆలోచిస్తారు. అనేది చక్కగా చూపించారు. డైరెక్టర్. సినిమా ప్రారంభం నుంచి కథలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అనికా విక్రమన్ పరిచయం, ఆమెతో సృష్టికి ముడిపడి ఉన్న సంబంధం వంటి విషయాలు ఇంట్రెస్ట్ కలిగిస్తాయి.
 
ఇటువంటి కథలో వర్తమానం కాలేజీ, యువత అలవాట్లు ప్రేమ, పెండ్లి అనేవి చూపించినా ఆ తర్వాత హీరోయిన్ జర్నీ ఊహకు అందని విధంగా డిజైన్ చేయడం విశేషం. ఆక్రమంలో విదేశీయులు ఏవిధంగా ఇండియాను అందులో హైదరాబాద్ ను టార్గెట్ చేస్తున్నారనేది చైనా కరోనా వైరస్ ను ఏవిధంగా చేసిందో అంతకంటే భయంకరమైనదిగా పంపితే దేశాన్ని నాశనం చేయాలనుకోవడం సరికొత్త పాయింట్. 
 
కథనంలో మంచి ట్విస్టుతో క్లైమాక్స్ కూడా చూపించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్‌లో వచ్చే ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అయితే ఈ కథనాన్ని దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి చెప్పగలిగాడు. మానవ మేధస్సుతో రూపొందించిన విజువల్స్ అదిరిపోయాయి. గ్రాఫిక్స్ సరికొత్త మాయజాలాన్ని చూపించాయి. సంగీతపరంగా  బీజీఎమ్ సన్నివేశానికి తగినట్లుగా వున్నాయి. నిర్మాత ఉన్నతంగా తీర్చిదిద్దాడు. అసలు ఇలాంటి కథను తీయడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.  
 
రొటీన్ ప్రేమ, పెండ్లి, కుటుంబ కథలు వస్తున్న తరుణంలో అంతకుమించి ఆలోచించే విధానమే ఈ సినిమా. ఇందులో నటించిన వారంతా బాగానే సూటయ్యారు. హీరో సౌరభ్ ధింగ్రా తెరపై చక్కని పరిణతితో నటించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. హీరోయిన్ అనికా విక్రమన్ కథకు సరిపోయింది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో బిగ్ బాస్ అఖిల్ సార్థక్  నటించాడు.
 
నెగెటివ్ పాత్రలో భూపాల్ రాజు, శివకుమార్ మెప్పించారు. సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ, మైమ్ గోపి, అజయ్ రత్నం, గాయత్రి గుప్త పర్వాలేదు అనిపిస్తాయి. మొత్తంగా చూస్తే, రొటీన్ సినిమాలు చూసి విసుగుపుట్టిన ప్రేక్షకులకు విజువల్ ఎఫెక్ట్స్‌ కథ కొత్త రిలీఫ్ ఇస్తాయనడంలో సందేహం లేదు.
రేటింగ్ : 2.75/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
Thaman: చెవిటి, మూగ అయిన ఇట్లు అర్జున తో ఫస్ట్ సింగిల్ చేయించిన ఎస్. థమన్‌