1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Adivi Sesh's Illogical Decoit Movie – Decoit Genuine Review

Decoit Review: లాజిక్ లేని అడివి శేష్ డెకాయిట్ మూవీ - డెకాయిట్ జన్యూన్ రివ్యూ

Decoit poster
Decoit poster
నటీనటులు : అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్  తదితరులు
సాంకేతికత:  ఛాయాగ్రహణం : దనుష్ భాస్కర్, సంగీతం : భీమ్స్ సిసిరోలియో, కూర్పు : కోదాటి పవన్ కళ్యాణ్, నిర్మాతలు : సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్, దర్శకుడు : షానియల్ డియో, స్క్రీన్ ప్లే : అడివి శేష్, కథ : అడివి శేష్.
 
హిట్ 2, గూఢచారి, మేజర్ చిత్రాలతో వైవిధ్యమైన కథానాయకుడిగా గుర్తింపు పొందిన అడవి శేష్ తాజాగా డెకాయిట్ - ఎ లవ్ స్టోరీ అంటూ ఈ శుక్రవారమే 10-ఏప్రిల్-2026న థియేటర్ కు వచ్చాడు. మృణాల్ ఠాకూర్ నాయికగా నటించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
హరి దాస్ (అడివి శేష్) అగ్ర కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తోంది. ఆమెకు ఆస్మా వున్నా నా ఊపిరి నువ్వే అంత ప్రేమికులుగా ఒకరికొకరు మారతారు. సాఫీగా సాగుతుండగా సరస్వతి అన్నకు తెలియడంతో వ్యతిరేకించడమేకాకుండా హరి దాస్ స్నేహితురాలిని చంపేస్తాడు. అది హరిదాస్ పై నెట్టబడుతుంది. సరస్వతి కూడా సాక్షం చెబుతుంది. అలా 13 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి సరస్వతి పై పగతో రగిలిపోతూ పారిపోయి బయటకు వస్తాడు. కానీ తదంతర పరిణామాలతో మళ్ళీ హరి ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. అలా ఎందుకు జరిగింది? ఆ మార్పుకు కారణాలు ఏమిటి? అనేది  మిగిలిన కథ.
 
సమీక్ష:
ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది అడవి శేష్ గురించే. తన పాత్ర డిజైన్ బాగా చేసుకున్నాడు. డైలాగ్ మాడ్యులేషన్, డెకాయిట్ కు వుండాల్సి విధంగా హావభావాలు పలికించాడు. ఇక మృణాల్ ఠాకూర్ గురించి చెప్పాలంటే జీవితంలో ఏదో కోల్పోయిన విధంగా ఆమె వుంటుంది. మేజర్ లోనూ అలానే ఆమె హావభావాలుంటాయి. కథ కూడా అడవిశేష్ రాసుకున్నాడు కనుక కరోనా టైంలో కార్పొరేట్ ఆసుపత్రులలో దోపిడీ ఏ విధంగా వుంటుందో చక్కగాచూపించాడు. కులం తక్కువ వాడు పెద్ద కులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తే ఏమవుతుంది అనేది పరువుహత్య కేసులు చాలా జరుగుతున్నాయి. సినిమాలూ వచ్చాయి. డెకాయిట్ కూడా అటువంటి చిత్రమే. కానీ నేపథ్యం వేరుగా చూపించాడు.
 
చెప్పాలంటే.. 
- ఇందులో చాలా లోపాలున్నాయి. డైలాగ్స్ లు ఏమి చెబుతున్నారో భీమ్స్ ఇచ్చిన బీజియమ్స్ వల్ల అర్థం కావు. చికాకు పుట్టిస్తాయి.
- హీరో హీరోయిన్ల టవ్ ట్రాక్ లో సరైన క్లారిటీ వుండదు. కేవలం రక్తదానం చేసే టైంలో పలుకరింపులు ఒక్కటికావడం చూపిస్తాడు.
- గుండె మార్చడం ఎవరికి అనేది ట్విస్ట్ రూపంలో చివరిలో చెప్పాడనుకున్నా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. కేవలం ప్రేక్షకులను మోసం చేయడమే అవుతుంది.
- హార్ట్ మార్చాలంటూ ఒకరిని చూపించడం చివరిలో హీరోయిన్ కు అనడం లాజిక్ లేని విషయం. హార్ట్ మార్చాలనుకున్న ఆమె ఛేజింగ్ లు, కారు డ్రైవింగ్, బుల్లెట్ గాయం అయినా పరుగెత్తడం ఇవన్నీ బుల్ షిట్ అంశాలు.
- యాక్షన్ సన్నివేశాలు క్లయిమాక్స్ లో హీరో అంతాలా ఎందుకు కాల్పులు జరిపే సీన్ టూమచ్ గా వుంటుంది.
 
ఇక ఇందులో ప్రధాన అంశం దుబాయ్ కు హీరో వెళ్ళాలంటే 40 లక్షలు కావాలి. మరోవైపు తన భర్తను కాపాడడం కోసం 80 లక్షలు అవసరం పడడం. ఇద్దరి ఎయిమ్ కలిసి ఏవిధంగా డబ్బులు ఎక్కడనుంచి కొట్టేశారు. కొట్టేశాక ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఛేజింగ్ లు, ఫైటింగ్ లు సినిమా అంతా కనిపిస్తుంది. టేకింగ్ పరంగా బాగుంది.  క్లోజ్ షాట్స్ తో సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏది ఏమైనా ఇది కామన్ మేన్ కు పెద్దగా నచ్చకపోవచ్చు. నచ్చితే సినిమా ఆడుతుంది.
 
- ప్రకాష్ రాజ్ తన మార్క్ నటనతో మెప్పించాడు. అనురాగ్ కశ్యప్,సునీల్ పాత్రలు సరిగ్గా ఉపయోగించుకోలేదు.  దర్శకుడు షానియల్ డియో తీసుకున్న స్టోరీ లైన్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నాయి.కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి. చాలా చోట్ల లాజిక్ కూడా మిస్ అయింది. మొత్తానికి సినిమా పూర్తి స్థాయిలో అయితే ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. నిర్మాతలుగా సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
 
ఫస్టాఫ్ బాగుంది అనిపించినా సెకండాఫ్ లో వచ్చేసరికి కథంతా ఆసుప్రతి, దొంగతనం, ఛేజింగ్ బాగున్నా, హీరోయిన్ పాత్రలో ట్విస్ట్  అనేవి ప్రధాన లోపం. ఇంత లాజిక్ లేని పాయింట్ తో సినిమా చేయడం కూడా హాస్యాస్పదం. ఈసారైనా అలాంటి మిస్టేక్ లేకుండా సినిమాలు తీస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 రేటింగ్ : 2.25/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
Varun Tej : కొరియన్ కనకరాజు కోసం కొరియన్, తెలుగు మిక్స్ సాంగ్ చేస్తున్న థమన్