సంబంధిత వార్తలు
- Nag Ashwin: సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్ కాంబినేషన్ చిత్రానికి టైటిల్ సింగ్ గీతం ఖరారు
- Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!
- తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?
- Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి
- కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?
Sing Geetham Review: ఆసక్తిగా మలిచిన సింగీతం శ్రీనివాస్ చిత్రం... సింగ్ గీతం రివ్యూ
Ayan K, Ahilya Bemru, Shalini Kondepudi
సాంకేతికత: దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావ్, నిర్మాత: నాగ్ అశ్విన్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: అనుకుర్ సి , నిర్మాణ సంస్థ : వైజయంతి మూవీస్, విడుదల తేదీ: 12th జూన్ 2026.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రాలు ఒక్కోటి ఒక్కో వినూత్నమైన కథలు. పుష్పక విమానం, ఆదిత్య 369 వంటి సినిమాలు క్రియేటివ్ ఐడియాలతో చేసినవే. ఇప్పుడు కూడా 94 ఏళ్ళ వయసులో కూడా సింగ్ గీతం అనే సినిమా తీశారు. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాత. వైయంతీ మూవీస్ అధినేతలు మరో నిర్మాతలు. మాటలు పాటలుగా వుండడమే సింగ్ గీతం ప్రత్యేకత అని చెప్పిన మాటలు నిజామా కాదా? అసలు అలాంటి సినిమా ఎలా వుంటుందనేది ఆసక్తి నెలకొంది. మరి సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
కథ:
భోపాల్ సెంట్రల్ జైలులో హాయిగా వుంటున్న ప్రతాప్ కి(అయాన్) ను బలవంతంతా విడుదల చేస్తారు. బయటకు రాగానే ఓ లాయర్ వచ్చి అతని తండ్రి ఆస్తి పేపర్లు ఇవ్వడంతో ఆ స్థలాన్ని దక్కించుకోవాలని కుబేరపురం అనే ఊరికి వెళతాడు. అదంతా కొండ ప్రాంతం ఊరిలో ఒకే ఒక్క పెద్ద వ్రుక్షం తొర్రలో గౌరి(అహిల్య) నివశిస్తుంటుంది. చెట్టును కాపాడాలనేది ఆమె థ్యేయం. కానీ ఆ ఊరిలోని ప్రజలను మభ్యపెట్టి బంగారు గనులకోసం తవ్వకాలు చేస్తూ రేణు(షాలిని) వారిని కార్మికులుగా మార్చేస్తుంది. ఇది గ్రహించిన ప్రతాప్ కూడా డబ్బుకోసం ఆమెతో చేతులు కలుపుతాడు. దానితో చెట్టును నరికేస్తారు.
ఇది సహించని గౌరి(అహిల్య) కుబేరుడిని తిడుతూ.. అక్కడే ఉన్న ఓ గుహలో పడిపోతుంది. ఆ గుహలో ఆమె ఊరి ప్రజలను తిడుతూ మూడు కోరికలాంటి శపానార్థాలు పెడుతుంది. వెంటనే ఆమె కోరుకున్నట్లు ఊరిలోని వారంతా మాటలకు బదులు పాటలు రూపంలో మాట్లాడుతుంటారు. ఆ తర్వాత ఏమి జరిగింది? చివరికి ఊరి జనాలు మామూలుగా మాటలు మాట్లాడారా? లేదా? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఈ చిత్ర కథే చాలా భిన్నంగా వుంది. మామూలు కథలా సాగుతూ పర్యావరణ పరిర్షణ, దైవ దూషణ వల్ల ఏమి జరుగుతుంది. నిజాయితీ వుంటే వారి జీవితాలు ఎలా వుంటాయి? అనే అంశాలను దర్శకడుు సింగీతం చక్కగా ఆవిష్కరించాడు. ఇప్పటి జనరేషన్ కూడా ఆకట్టుకునేలా చూపించడం విశేషం. మాటలను కూడా పాటల్లాగా మాట్లాడడం, వాటి సన్నివేశాలు కూడా ఎక్కడా బోర్ కొట్టకపోవడం దర్శకుని ప్రతిభకు నిదర్శనం.
ఎప్పుడో 30 ఏళ్ళనాడు అనుకున్న కథ ఇదని ఇటీవలే దర్శకుడు రాజమౌళిగా వెల్లడించారు. మరి అలాంటి కథను ఇప్పటికీ ఆకర్షణీయంగా తీయడం విశేషం అనే చెప్పాలి. ఇందులో నటీనటులంతా పెద్దగా మేకప్ లేకుండా నాచురల్ గా నటించినట్లు కనిపించడం విశేషం. అయాన్, అహల్య అని కాకుండా షాలిలీ తోపాటు మిగిలిన పాత్రలన్నీ సన్నివేశపరంగా జీవించారనే చెప్పాలి. పక్షవాతం బారిన పడిన వ్యాపార వేత్తగా బెనర్జీ నటించాడు. ఆఫ్రికా బిజినెస్ మేన్ గా ఆ దేశపు నటుడు నటించి మెప్పించాడు కూడా.
అయితే ఎక్కడా విసుగులేకుండా ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేలా సినిమాను దర్శకుడు మలిచాడు. అయాన్ తల్లిదండ్రులుగా రాహుల్ సాంక్రుత్యాన్, నివేదా పేతురాజ్ నటించగా, క్లయిమాక్స్ లో వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి ట్విస్ట్ ఇస్తాడు.
ఇక సాంకేతిక నిపుణుల పనితీరు అందరినీ బాగుంది. సినిమాటోగ్రాఫర్, సంగీతపరంగా దేవీశ్రీ ప్రసాద్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు కథను అనుగుణంగా వుంది. ఇక కథనాన్ని నడిపించడంలో సింగీతం శ్రీనివాస్ బాధ్యత ఎంత వుందో దాన్ని తగు విధంగా మార్చుకున్న నాగ్ అశ్విన్ బ్రాండ్ కూడా కనిపిస్తుంది. అయితే ఇటీవలే నాగ్ అశ్విన్ ఇంటర్వూ చెబుతూ, అప్పట్లో కమల్ హాసన్ వంటి స్టార్ తో అనుకుని పక్కన పెట్టేసిన కథను ఈతరంతో తీసి ప్రయోగాత్మకంగా తీసి మెప్పించాలనుకోవడం కూడా విశేషమే.
కథ ఆరంభంలోనే పాటలు లేకుండా మాటలతో కథ సాగుతూ ఊరిలో దేవుని శాపం వల్ల మారడం అనేది కూడా లాజికల్ గా బాగుంది. క్లైమాక్స్ ని కూడా చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశారు. అక్కడ హ్యుమానిటీని తట్టిలేపే సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి.వాస్తవానికి ఈ సినిమాకి సింగీతం విర్చువల్ డైరెక్షన్ మాత్రమే చేశారు.
ఈ కథలోని కుబేర కొండలు సెట్ అంతా కల్కి స్టూడియోలోని కొంత భాగాన్ని వాడుకున్నారు. ఎందుకంటే అది వైజయంతీ మూవీకి చెందిన స్థలం కావడం. దేవి శ్రీ ప్రసాద్ కి సింగ్ గీతం అనే సినిమా పెద్ద ఛాలెంజ్. 2 గంటల 17 నిమిషాల సినిమాలో మొదటి అరగంట తీసేస్తే.. మిగతా కథనాన్ని నడిపించాల్సిన భారం అంతా మ్యూజిక్ పైనే పడింది.
ఈమధ్య రొటీన్ లవ్, కుటుంబకథా చిత్రాలు లేదంటే పౌరాణికాలు వస్తున్న తరుణంలో నాచురల్ గా అనిపించే కథతో తీయడం అభినందనీయమే. నిస్సందేహంగా ఈ వీకెండ్ థియేటర్ కి వెళ్ళి ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.ఈ తరం ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ లాంటి సినిమా. వరల్డ్ సినిమాలో ఇలాంటి మూవీ రాలేదు. కమర్షియల్‌గా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం అని నిర్మాత నాగ్ అశ్విన్ ఇటీవలే ప్రకటించాడు. ఆయన అన్నమాట నిజమేనని అనిపిస్తుంది.
రేటింగ్ : 3/5
