1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Did Sharwanand and Rajasekhar pull it off with this bike racing ride? – Biker Review

Biker Review: బైక్ రేసింగ్ రైడ్ తో శర్వానంద్, రాజశేఖర్ గట్టెక్కించారా - బైకర్ రివ్యూ

Biker - Sharwanand
Biker - Sharwanand
నటీనటులు : శర్వానంద్, డా. రాజశేఖర్, మాళవిక నాయర్ తదితరులు.
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్,  ఎడిటింగ్ : అనిల్ పసల, సంగీతం : జిబ్రాన్, నిర్మాతలు: వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకుడు : అభిలాష్ రెడ్డి, సంగీతం : జిబ్రాన్.
 
బైకర్ అనగానే రేస్ కు సంబంధించింది అని తెలిసిపోతుంది. ఈ సంక్రాంతికి  శర్వానంద్‌ `నారీ నారీ నడుమ మురారి` చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఆ టైంలోనే చేసిన `బైకర్‌` నేడు ఏప్రిల్‌ 3న విడుదలైంది..డా. రాజశేఖర్‌ ఇందులో కోచ్ గా నటించాడు.మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
తమిళనాడు లో వుండే సునీల్ నారాయణ్ (రాజశేఖర్)  టాప్ క్లాస్ మోటోక్రాస్ రేసర్. చిన్నతనంలో అతని కొడుకు వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్) కు స్పూర్తి తండ్రే. అలా కొడుక్కి కఠినమైన శిక్షణ ఇచ్చి రేసర్‌గా తీర్చిదిద్దుతాడు. జాతీయస్థాయిలో రేసర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. తల్లి లేని అన్నీ తానై పెంచుతాడు. అలాంటి విక్కీ అనన్య (మాళవిక నాయర్)తో ప్రేమలో పడి రేసర్ గా నెం.1గా వున్నప్పుడు వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోతాడు. దానివల్ల సునీల్ స్పోన్సర్లతో అవమానాలు పడతాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ఏం జరిగింది? మళ్ళీ విక్కీ తిరిగి వచ్చాడా? సునీల్ పై ఎందుకు చెడ్డపేరు వచ్చింది? అనేవి మిగిలిన సినిమా.
 
సమీక్ష:
కథపరంగా చూసుకుంటే గతంలో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా తరహాలో వుంటుంది. అందులో చిన్నపాప వుంటుంది. ఇందులో బాబు వుంటాడు హీరోకు. ఇక బైక్ రేస్ గురించి కనుక దీనికి అనుగుణంగా కథను దర్శకుడు రాసుకున్నాడు. తమిళంలో కూడా బురద ఫైట్ రేసింగ్ సినిమా కూడా వచ్చింది. ఇలా ఏదో భాషలో ఏదో గేమ్ నేపథ్యంలో సినిమా వచ్చాయి. అయితే తెలుగులో వచ్చిన ఈ బైకర్ మాత్రం కాస్ట్ లీ గేమ్.  రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం, యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. కొన్ని సీన్స్ చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డాల్బీ థియేటర్ లో ఈ సినిమా చూస్తే నేపథ్యం సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రేక్షకుడు అద్భుతంగా ఫీలవుతాడు.
 
జాతీయస్థాయిలో మీడియా ఎక్కువగా పాపులర్ చేసేది కేవలం క్రికెట్ కు మాత్రమే. అలాంటిది బైక్ రేస్ గురించి విదేశాల్లోనే వుంటుంది. దాన్ని ఇండియాలో టాప్ ఆటగాళ్ళు వున్నా సరైన సపోర్ట్ లేక ఏవిధంగా వెనకడుగువేస్తున్నారు. ప్రతి ఆటల పోటీలో పోటీదారుడుతోపాటు క్రిమినల్ గా ఆలోచించి స్పాన్సర్లు కూడా ఎలా బిహేవ్ చేస్తారనేది కళ్లకు కట్టినట్టు దర్శకుడు చూపించారు. ముఖ్యంగా విదేశాల్లో బాక్సింగ్ నేపథ్యంలో ఇలాంటి కథలు చాలా వచ్చాయి.
 
కథకు అనుగుణంగా పాత్రనుబట్టి శర్వానంద్ 23 కేజీలు తగ్గి ఫిట్ గా వుండడం, అందుకు తగిన కసరత్తు చేయడం వంటివి ఇందులో కనిపిస్తాయి. రేస్ లో హై జంప్ అనేది సాహసంతోకూడుకున్నది. అందుకే ఇలాంటి సాహసాలు యూత్ చేయవద్దని ముందుగా స్లయిడ్ వేసి చెబుతాడు దర్శకనిర్మాతలు. ఈ సినిమా కూడా యూత్ కోసం తీసిందే. నేటి జంజీ యుగంలో ఇలాంటి రేస్ లు వీడియోలో గేమ్ లుచూసి ఎంజాయ్ చేసేవారికి బాగా నచ్చుతుంది. మిడిల్ ఏజ్ వారికి తన కొడుకు తమను తాముచూసుకునేట్లుగా వుంటుంది.
 
ఇందులో డా. రాజశేఖర్‌తో వచ్చే సన్నివేశాలు కేరెక్టర్ పరంగా చాలా బాగా పండాయి. చాలా కాలం తర్వాత మంచి రోల్ చేశాడనిపించింది. పెద్దగా హావభావాలు లేకపోయినా హుందాగాఏజ్ పరంగా చేసిన పాత్ర అది. సెకండాఫ్ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది. మాళవిక నాయర్ తన పరిధి మేరకు చక్కగా నటించింది.
 
అయితే, కథలోని కీలక మలుపుల దగ్గర దర్శకుడు సేఫ్ గేమ్ ఆడాడు. కొత్తదనం కోసం ప్రయత్నించకుండా రొటీన్ ఫార్మాట్‌ను ఎంచుకోవడం కాస్త నిరాశపరుస్తుంది. హీరో మానసికంగా బలంగా చూపించాల్సింది. ఇందులో పాల్గొన్న రేసర్లు నిజంగా లైఫ్ లో చేసినవాళ్ళే. ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుంది, కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది.
 
సాంకేతికపరంగా చూస్తే, సినిమాటోగ్రఫీ తో  జె. యువరాజ్ రేసింగ్ సీన్స్ బాగా డీల్ చేశాడు. ఇక పత్రేక ఆకర్షణ జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం. సెకండాఫ్‌లో ఎడిటింగ్ పర్వాలేదనిపించినా.. ఫస్టాఫ్‌లో అనిల్ పసల కొన్ని అనవసరమైన సీన్స్‌కు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువల పరంగా వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కొత్త పాయింట్‌ను తీసుకొని ఎంగేజింగ్‌గా మలచడంలో సఫలం అయ్యాడు. 
 
అయితే సామాన్యుడు పెద్దగా తెలీని  మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ ను దర్శకుడు పరిచయం చేశాడు. హీరో కష్టపడ్డాడు. నిర్మాతలు ఖర్చుపెట్టారు. దర్శకుడు బాగా తీశాడు. ఇలాంటి సినిమాను యూత్ మెచ్చితే శర్వాకు మరో హిట్ సినిమా అవుతుంది.
 రేటింగ్ : 2.75/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
Karmeni Selvam Review: సముంద్రఖని నటించిన కార్మేని సెల్వం ఎలా వుందంటే... కార్మేని సెల్వం రివ్యూ