1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Did 'Ustaad Bhagat Singh' live up to the hype this Ugadi? A Real Review.

Ustaad Bhagat Singh Real Review: ఉస్తాద్ భగత్ సింగ్ యుగాదికి కాలర్ ఎగరేశాడా? లేదా? రియల్ రివ్యూ

Ustad Bhagat Singh - Pawan style
Ustad Bhagat Singh - Pawan style
నటీనటులు : పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, రావు రమేష్, కే ఎస్ రవికుమార్, గౌతమి, టెంపర్ వంశీ తదితరులు.
సాంకేతికత:  సినిమాటోగ్రాఫర్ : అయానకా బోస్, సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: తమన్, ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్, నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్, కథ, మాటలు, దర్శకత్వం: :హరీష్ శంకర్
 
కథ:
నల్లమల ఫారెస్ట్ లోని ఓ గూడెంలో చిన్నయ్యగా పిలవబడే అనాథ బాలుడిని ఆ ఊరి స్కూల్ మాస్టర్ చంద్రశేఖర్ రావు (కే ఎస్ రవికుమార్) గార్డెయిన్ గా తీసుకుంటాడు. చిన్నతనంలోనే భగత్ సింగ్ కథలు చదివి అన్యాయంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. తన తండ్రి ఉస్తాద్ పేరును మాస్టర్ పెట్టిన భగత్ సింగ్ పేరుతో ఉస్తాద్ భగత్ సింగ్ గా చలామణి అవుతాడు. తన గార్డియన్ అయిన మాస్టర్.. రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు. ఓ వివాహానికి అటెండ్ అయిన మాస్టర్ పై కాల్పులు జరుపుతారు.

సీఎం కావాలని తాపత్రయం పడుతున్న నల్ల నారప్ప (ఆర్ పార్తిబన్) చేసిన కుట్రగా తెలుస్తుంది ఉస్తాద్ కు. ఆ తర్వాత ఉస్తాద్ ఏం చేశాడు? ఈ ప్రోసెస్ లో పేరు మోసిన తీవ్రవాది (అజ్మల్ రహీం)తోపాటు మరికొందరు ఉస్తాద్ పై పోరాటానికి దిగుతారు. దీని వెనుక ఎవరు వున్నారు? ఈ క్రమంలో లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) ల ప్రాముఖ్యత ఏంటి? అనేవి మిగిలిన సినిమా.
 
సమీక్ష :
గబ్బర్ సింగ్ కాంబినేషన్ అనగానే సరిగ్గా అదే ఫార్మెట్ లో వుంటుందని అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఆంధ్ర ఉపముఖ్యమంత్రి హోదాగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే వినోదంతోపాటు అన్యాయంపై పోరాడే వాడిగా చూపించాలి. అందులో పోలీస్ డిపార్ట్ మెంట్ అయిన పవన్  ఏ విధంగా ప్రజలను, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న రాజకీయానాయలను ఏవిధంగా కంట్రోల్ చేశాడనేది చూపించారు. బాధ్యతగల హీరోగా దర్శకుడిగా చేసిన సినిమాగా చెప్పవచ్చు. ఆ క్రమంలో సినిమాటిక్  సన్నివేశాలు, సంభాషణలు, యాక్షన్, పాటలుంటాయి. 
 
అయితే, కథను చక్కగా దర్శకుడు రాసుకున్నా కొన్ని సినిమాలలోని పాయింట్లను తెలివిగా మలిచి కథను రాసుకోవడం విశేషం. పవన్ పాత్రపరంగా ఆహార్యంగా గతంలో చూసినట్లుగా వున్నాడు. రాశీఖన్నా పాత్రను కూడా ఆమె వైవాహిక జీవితానికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు తీసుకున్న కేర్ బాగుంది. సైకో డాక్టర్ గా రమేష్, ప్రభాస్ శీను పాత్రలు కాస్త ఎంటర్ టైన్ చేస్తాయి. ఇక లవ్ ట్రాక్ వుండాలి కాబట్టి యూత్ కూ, ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యేలా శ్రీలీల పాత్ర వుంటుంది. రావురమేష్ తోపాటు మిగిలిన పాత్రలు కథలో భాగంగా వుంటాయి.
 
ప్రత్యేకంగా చెప్పాల్సింది ప్రతినాయకుడు, విలన్ పాత్రధారి పార్థీబన్. సి.ఎం. పదవికోసం ఎంతటి అచారాలకు చేయాలో చూపించాడు. దేశంలో జరిగే పరిస్థితులకు అద్దంలా దర్శకుడు రాసుకున్నాడు. గతంలో ఇలాంటి ఫార్మెట్ లో వున్నా పవన్ కోసం కాస్త కేర్ తీసుకున్నాడనే చెప్పాలి. సంబాషణల పరంగా ప్రాసలు కూడా వుంటాయి. 
 
జై శ్రీరామ్, జైహింద్ అనే మాటలు కూడా సన్నివేశపరంగా వుంటాయి. నేను చేసే పనుల్లో నా గ్రౌండ్ గట్టిగా వుంటుంది. నా నెట్ వర్క్ నెక్ట్ లెవల్ లో వుంటుంది అని పలికే డైలాగ్ లు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ముస్లిం ఉగ్రవాదులను చూపించినా అది కూడా కనెక్ట్ అయ్యేట్లుగా వుంటాయి.
 
హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో కూడా ఎక్కడా సున్నితమైన గీతను దాటకుండా దర్శకుడు జాగ్రత్త తీసుకున్నాడనే చెప్పాలి. కథో పెద్ద ట్విస్ట్ లున్నా అవి మామూలుగా అనిపిస్తాయి. వ్యవస్థను మార్చాలంటే బాధ్యతాయుతమైన పదవిలో వుండాలి. ఆ పదవి వుండి కూడా పోలీసు వ్యవస్థ ఎంత భ్రష్టు పడిందో ఇందులోనూ చూపించారు. అసలు రాజకీయనాయకులకు తొత్తులుగా వారు మారడం కూడా చిన్నప్పటినుంచి చూస్తున్న కథలే. ఢిల్లీలో నిర్భయ ఉదంతం లాంటి సంఘటనను కూడా కథకు అనుగుణంగా రాసుకుని దానిని తో ఎమోషన్స్ బాగా పండించాడు.
 
దేవిశ్రీప్రసాద్ సంగీతం బాగానే వుంది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గత సినిమాలకుమాదిరిగానే వుంది. కాస్త రణగొణ ధ్వనులు తగ్గిస్తే రథ యాత్ర సన్నివేశంలో పండితులు పలికే శ్లోకాలు, డైలాగ్ లు మరుగుపడిపోయాయి. ఏసీపీ లాంటి ఆఫీసర్, తన తోటి పోలీసులుతో హీరోయిన్ కి సెక్యూరిటీగా పంపడం ఓకే కానీ మరీ చిన్న చిన్న ఆకతాయి పనులకు కూడా అంటే అవన్నీ ఓవర్ గా ఉంటాయి.
 
ఈ చిత్రానికి నిర్మాణ విలువలు బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ రిచ్ నెస్ బాగా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. సినిమాలో ఏది చేసినా సమాజానికి ప్రజలకు, అడవికి మేలు చేయాలనో తపన హీరో పాత్రలో కనిపిస్తుంది. భగత్ సింగ్  పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ఉస్తాద్ ను దర్శకుడు మార్చాడు. పాలకులకంటే వ్యవస్థను మారిస్తే దేశం బాగుపడుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలనే సందేశాన్ని దర్శకుడు చెప్పాడు. మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ఉగాదికి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ కి ప్రేక్షకులకు మెప్పిస్తుందనే చెప్పాలి. సినిమా ఓకే అనిపిస్తుంది.
రేటింగ్ : 3/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
Thiruveer: నవవధూవరులైన తిరువీర్, పాయల్ రాధాకృష్ణ కు ఏమయింది?