1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. How is Dhanush's Kara? Kara Movie Review

Kara Movie Review: ధనుష్‌ కర మూవీ ఎలా ఉందంటే.. కర మూవీ రివ్యూ

Dhanush
Kara - DhanusH
తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా కుబేరతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు నటించగా, దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఐషరి కే.గణేష్ తమిళంలో నిర్మించగా, ఈ మూవీని తెలుగులో C. H.సతీష్ కుమార్ విడుదల చేశారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా గురువారం(ఏప్రిల్ 30న) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. 
కథ:
కరస్వామి ఉరఫ్ కర (ధనుష్) ఓ దొంగ. 16 ఏళ్ళ వయస్సులో గ్రామంలోని తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకని పారిపోతాడు. అలా దొంగగామారి ఊరిలోని రాజకీయనాయకుడి ఇంటిలో చివరి దొంగతనం చేస్తూ పట్టుబడి దేవుడి దయవల్ల తప్పించుకుంటాడు. కట్ చేస్తే, చిన్న పట్టణంలో హోటల్లో తన భార్యతో పనిచేస్తుంటాడు. ఓ దశలో విసిగిపోయి తానే హోటల్ పెట్టాలని నిర్ణయానికి వచ్చి ఊరిలోని ఎనిమిది ఎకరాల పొలాన్ని తండ్రి కి చెప్పి పత్రాలు తీసుకోవాలని వస్తాడు. కానీ అప్పటికే అవి బ్యాంక్ లోన్ లో వుండడం కిస్తీల పేరుతో డబ్బు కట్టలేక చాలా ఇబ్బందులు పడడం చూసి చలించిపోతాడు. తన నాన్న లాంటి పరిస్థితే ఊరంతా వుంటుంది. 
మరోవైపు కిస్తీలు కట్టలేకపోవడంతో పొలాలను జప్తు చేయడానికి బ్యాంక్ నుంచి అధికారులు రావడం, తండ్రి చనిపోతే సమాధి కూడా పొలంలో పెట్టకూడదని అడ్డుపడడంతో మార్చురీలోనే వుంచి ఆ డబ్బు కట్టాక ఘనంగా పొలంలో సమాధి చేయాలకునే క్రమంలో మరోసారి దొంగగా మారతాడు. అలా మారి ఎక్కడ దొంగతనాలు చేశాడు? చివకిరి పోలీసుల వలలో పడ్డాడా? లేదా? అనేది మిగిలిన సినిమా.

సమీక్ష:
ఈ సినిమా కథంతా 1990 కాలం నాటిది. అప్పట్లో ఊరిలోని పొలాలున్న వారి దగ్గరకు వచ్చి ఎరువులకోసం, ట్రాక్టర్ల కోసం లోన్ లు ఇస్తామంటూ బ్యాంక్ లవారు ఇంటికి వచ్చీ మరీ అడిగి నిరక్షరాస్యులైన రైతులన్ని మోసం చేస్తుండేవారు.అలా మోసం పోయిన ఊరిలోని రైతుల జీవితాల్లోకి కరస్వామి వెలుగు నింపాడనేది క్తుప్ంగా సారాంశం. నేపథ్యం వేరయినా కథలోని పాయింట్ చాలా సినిమాలలో చూసిందే. ఆమధ్య మహేష్ బాబు, ప్రకరాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాకూడా ఇలాంటిదేు. 
ఇక ఇందులో డైలాగ్ లు బాగా దర్శకుడు రాసుకున్నాడు. బ్రిటీష్ వారు కప్పం పేరుతో ప్రజల్ని పీడించినట్లే రైతులను బ్యాంక్ వారు పీడిస్తున్నారు అంతే తేడా అంటూ ఓ రైతుచేత చెప్పించాడు. ఆ కాలం నాటి రైతులు, పాత్రలు, వాహనాలు, పోలీసు వ్యవస్థ, బ్యాంక్ లు వాటన్నంటినీ ఛైర్మన్ ఏవిధంగా ప్రజలను మోసం చేశాడనేది క్లియర్ కట్ గా చూపించాడు. 
ఈ సినిమాలో ప్రత్యేకతలు చెప్పాలంటే..
ధనుష్ నటన రొటీన్ గా అనిపిస్తుంది. ఇడ్లీ కొట్టు చిత్రాన్ని పోలీవున్నట్లు కొన్ని వుంటాయి.
అప్పటి లొకేషన్లు, పోలీసు స్టేషన్ లో  కర తన్నులు తినడం నాచురల్ గా వుంది.
నటి మమితా బైజు పాత్ర పరిమితమే అయినా ఎమోషనల్ గా వుంటుంది.
విఘ్నేశ్ రాజా రచన, దర్శకత్వం బాగుంది.
కె.ఎస్. రవికుమార్ తండ్రిగా, మామయ్యగా ఎం.ఎస్. భాస్కర్ బాగా సూటయ్యాడు.
సంగీతపరంగా, పాటలపరంగా అప్పటి కాలానికిఅనుగుణంగా వున్నాయి.

ఇక సినిమా మొదటి భాగం సాదాసీదాగా అనిపించిందని, కానీ రెండో భాగం మాత్రం చాలా నెమ్మదిగా, బోర్‌గా సాగిందని పేర్కొన్నాడు. క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెట్టలేకపోయిందని చెప్పవచ్చు. ఉన్నవాడు లేనివాడిని దోచుకుని ప్రజలకు పంచడం రాబిన్ హుడ్ ఫార్ములా. ఈ కథలో బ్యాంక్ ల ద్వారా మోస పోయిన సామాన్య రైతులు ఎదురుతిరిగితే పోలీసువ్యవస్థ కూడా తోడయి వారిని దండించడం అనేది ఇప్పుడు జరుగుతున్నదే. అయితే కలెక్టర్ వరకు బ్యాంక్ వారిపై ఫిర్యాదులు వెళ్లినా దాని గురించి కనీసం పట్టించుకోకపోవడం, రాజకీయ వ్యవస్థ కూడా ఇందులో చూపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే  జి.వి. ప్రకాష్ సంగీతమే సినిమాకు కొంత బలం అని చెప్పాలి. కానీ కథ మాత్రం పూర్తిగా ప్రిడిక్టబుల్‌గా మారిపోయిందని, సన్నివేశాలు చాలా లెంగ్తీగా ఉండటంతో బోర్ ఫీలింగ్ వచ్చిందని చెప్పాడు. దాదాపు 2గంటల 47 నిముసాల నిడివితో కాస్త సాగదీతగా అనిపిస్తుంది.  ఓ దొంగ సామాన్య రైతుల ద్రుష్టిలో హీరో ఎలా అయ్యాడనేది చిత్ర కథాంశం. సమాజంలో ప్రజలను ఏవిధంగా మోసం చేయాలి. చేస్తే దొరకకుండా ఎలా వుండాలనేది వ్యవస్థల గురించి  జరిగిన జరుగుతున్న బ్యాంకింక్ వ్యస్థల నేపథ్యంలో కథ ఇది. ఈ చిత్రం ఓటీటీకి బాగా సూటవుతుంది. 
రేటింగ్: 2.5/5
About Writer
దేవీ