1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. How is Jetlee, starring Satya and Vennela Kishore? — Jetty Review

Jetly Review: సత్య, వెన్నెల కిశోర్ నటించిన జెట్లీ ఎలా వుందంటే.. జెట్లీ రివ్యూ

Jetlee
Satya, Vennela Kishore
నటీనటులు : సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్, శుభలేఖ సుధాకర్ తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం : సురేష్ సారంగం, సంగీతం : కాల భైరవ, నిర్మాతలు : చెర్రీ, హేమలత పెదమల్లి, దర్శకుడు : రితేష్ రానా

మత్తు వదలరా సినిమా టీమ్ కలిసి మరోసారి కొత్త ప్రయోగం అంటూ జెట్లీతెో థియేటర్ లోకి వచ్చారు. కమెడియన్ సత్య హీరోగా దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ సినిమా గురించి రకరకాలుగా ప్రమోషన్లు నిర్వహించారు. టీజర్, ట్రైలర్ లో సత్య ప్రధాన పాత్రతో తనే హీరోగా కనిపిస్తాడు. తను ఏం చేసినా బాగుంటుందనే విమానంలో జరిగే కథగా దర్శకుడు తెరకెక్కించారు. మరి ఈరోజే, మే1న విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ:
ప్రజాపతి (అజయ్) తన ప్రజాపతి బ్యాంక్ ని 15 వేల కోట్లకు దివాళా తీస్తాడు. అది ఛైర్మన్ హోదాలో వున్న శుభలేఖ సుధాకర్ చేశాడని నమ్మించి అతన్ని హత్య చేస్తాడు. ఆ తర్వాత ఖాతాదారులకు తెలీయకుండా దుబాయ్ ఎస్కేప్ కు విమానాశ్రయానికి వెళతాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ఏజెంట్ శివాని రాయ్ (రియా సింఘా) అతన్ని ప్రాణాలతో స్పెషల్ ఫ్లైట్ లో దుబాయ్ నుంచి కొచ్చి రావాల్సి ఉంటుంది. అక్కడే ఇదే ఫ్లైట్ లో ఉన్న డాక్టర్ వేద్ వ్యాస్ (సత్య) ఈ ఆపరేషన్ లోకి ఇన్ వాల్వ్ అవుతాడు. తను మల్టీపుల్ డిజాస్టర్ వ్యక్తిగా వ్యవహరిస్తాడు. తన గతం ఏంటి అనేది మర్చిపోయి ఎంటర్ అయ్యిన తను ఏం చేశాడు? అసలు తను కూడా ఎందుకు ఆ ఫ్లైట్ లో ఉన్నాడు? ఆ తర్వాత అక్కడ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

సమీక్ష:
జెట్లీ అనే సినిమాలో కథలోని అంశం చాలా సినిమాల్లో వచ్చిందే. కమేడియన్ ను హీరోగా చేయాలనే దర్శక నిర్మాతల ఎయిమ్ తో చేసిన సినిమా. ఈ కథలో ఎక్కడా సామాన్య ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. చాలా చోట్ల చికాకు పుట్టిస్తాయి. కథ ఎటునుంచి ఎటువైపు వెళుతుందో అర్థం కాదు. ఫ్లయిట్ లో వెన్నెల కిశోర్, గుండు సుందర్శన్ లతోపాటు పలువురు పాత్రలు జబర్దస్త్ డైలాగ్ తరహాలో సాగుతాయి. మత్తు వదలరా సినిమా చూసి అదే మత్తులో వున్న వారికి ఈ సినిమా నిరుత్సాహపరుస్తుంది.

ఇందులో అక్కడక్కడా మంచి ఫన్ ఉంది కాని వాటితో పాటుగా అంతర్లీనంగా బలమైన కథ మాత్రం మిస్ అయ్యిందని చెప్పాలి. ఆ కామెడీ సీన్స్ తప్ప ఇందులో మిగతా కథా, కథనాలు చాలా రొటీన్ ఫీల్ నే కలిగిస్తాయి.ఫస్టాఫ్ పర్వాలేదు కానీ సెకండాఫ్ కొంచెం డల్ గా సాగింది. సత్య రోల్ ఒకింత కంప్లీట్ కాకుండా ప్రెజెంట్ చేశారు. అలానే మధ్యలో కొన్ని సీన్స్ రొటీన్ అండ్ బోరింగ్ గా సాగాయి. అలానే కొన్ని లాజిక్స్, సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటున్న సమయంలో కథనం మరింత బలహీనంగా అనిపిస్తుంది. సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం ఎక్కడా వంక పెట్టడానికి లేదు. సాలిడ్ విజువల్స్ ని అందించారు. ఇందులో వి ఎఫ్ ఎక్స్ టీం ఎఫర్ట్స్ మెచ్చుకోవాలి. ఇక కాల భైరవ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టీవ్ గా అందించారు. కెమెరా వర్క్ కూడా ఈ సినిమా బాగుంది. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది.

ముఖ్యంగా సత్య పాత్ర డిజైన్ సినిమా ఆకర్షణ. ఆ తర్వాత వెన్నెల కిశోర్. అసలు జెట్లీ అనే అంటూ క్లయిమాక్స్ లో చెప్పి ట్విస్ట్ ఇస్తాడు. అయితే కథనంలో జరిగే తంతు అంతా గందరగోళంగా వుంటుంది. ఇది హై ఇంటలెక్చువల్ మైండ్ వున్న వారికి అర్థం అవుతుంది. దర్శకుడు ఎలాగూ ఆ తరహాలో ఆలోచిస్తాడు. కానీ ప్రేక్షకులకు అంత ఓపిగా వుండదుకదా. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా అర్థం పర్థంలేని సినిమా. మరి దీనికి సీక్వెల్ అంటూ ముగింపు. అది కూడా కామెడీగా.. మా సినిమాను ఆదరిస్తే అప్పడు ఆలోచిస్తామంటూ సెటైర్ వేసుకున్నారు. ఈ జెట్లీ సినిమా సినిమాకు తక్కువ ఓటీటీకి ఎక్కువ అని చెప్పవచ్చు.
రేటింగ్ : 2/5
About Writer
దేవీ