1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. How is Karmeni Selvam, starring Samuthirakani? — Karmeni Selvam Review

Karmeni Selvam Review: సముంద్రఖని నటించిన కార్మేని సెల్వం ఎలా వుందంటే... కార్మేని సెల్వం రివ్యూ

Karmeni Selvam posters
Karmeni Selvam posters
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో   తెలుగు, తమిళ భాషల్లో  రూపొందిన  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’.  సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్  ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.   ఏప్రిల్ 3న నేడే రిలీజ్ అయింది. డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా  ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
కార్మెని సెల్వం అంటే.. కారు డ్రైవర్ గా పనిచేసే సెల్వం కథ ఇది.. తను, తన చిన్న కుటుంబం మినహా లోకం విషయాలు పెద్దగా తెలీవు. అలాంటి సెల్వం.. సంపత్ అనే బిజినెస్ మేన్ ( గౌతమ్ మీనన్ ) దగ్గర నమ్మకంగా ఏళ్ళ తరబడి పనిచేస్తుంటాడు. సంపత్ భార్య అభినయ కూడా డ్రైవర్ ను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటుంది. ఇక సెల్వం భార్య శాంతి  (లక్ష్మీ ప్రియ) చెన్నై సముద్రతీరంలోని కాలనీలో ఇడ్లీ బండిపెట్టుకుంటుంది. వారికి ఒక కొడుకు. శాంతికి ఎప్పటికైనా సొంత ఇల్లు సాకారం చేసుకోవాలనే కోరిక బలంగా వుంటుంది. ఇద్దరు సంపాదించిన దానిలో కొంత పొదుపు చేస్తుంటారు. ఓ రోజు శాంతి కుటుంబంలోని వారింటికి ఓ ఫంక్షన్ కు వెళ్ళి అవమానించబడుతుంది. దానితో పొదుపు సొమ్ముతోపాటే మంగళసూత్రం తాకట్టుపెట్టి వారికి చదివిస్తుంది.
 
 దాంతో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత సంపత్ నెలపాటు విదేశాలకు వెళుతూ కారును ఇంటిదగ్గర పెట్టమని సెల్వం కు చెబుతాడు. ఆ టైంలో సెల్వం కొడుక్కు ప్రమాదం జరిగి తలకు గాయవుతోంది. చేతిలో డబ్బులుండవు. ఏమి చేయాలో తెలీని స్థితిలో ఎక్కడైతే అవమానం జరిగిందే వారింటికే వెళ్ళి 10వేలు అప్పుగా తీసుకుంటాడు సెల్వం. ఆ తర్వాత భార్యభర్తల మధ్య గొడవ మరింత పెరుగుతుంది. ఆ సమయంలో సెల్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? దాని వల్ల ఎటువంటి పర్యావసనాలు ఏర్పడ్డాయి. చివరికి స్వంత ఇల్లు కల నెరవేరిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఒకరకంగా సింపుల్ కథ ఇది. మధ్యతరగతి కుటుంబం, బిగ్ షాట్ కుటుంబం మధ్య జరిగే కథే. అయితే మొహమాటస్తుడు, లోకజ్నానం పెద్దగా తెలీని సెల్వం తను కేబ్ డ్రైవర్ గా మారి ఏవిధంగా లోకంపోకడ వుందో బాగా తెలుసుకున్నాడు. ఈ జర్నీలో పరిచయం అయిన వ్యక్తులు, మనస్తత్వాలు ఆదారంగా దర్శకుడు కథను రాసుకున్నాడు. ఇందులో కేబ్ ను బుక్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయే వాళ్ళు, కారు బాగా డ్రైవ్ చేశావంటూ దుబాయ్ కు ఆఫర్ ఇచ్చిన వారూ వున్నారు. అలా దుబాయ్ వెళ్ళిన సెల్వం ఇమడలేక పడిన మానసిక సంఘర్షణ బాగా చూపించాడు. 
 
దుబాయ్ లో ఓ రూమ్ లో నలుగురు వుండడం, వారివారి సమస్యలతో డబ్బు సంపాదన కోసం రావడం వంటివి నేచురల్ గా చూపించాడు. ఆ  క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో మీడియేటర్ల మోసాలు కూడా ఇందులో వాస్తవికంగా వున్నాయి. ఒక రకంగా ఇవన్నీ దర్శకుడు తనకు జరిగిన కొన్ని అనుభవాలు, ఇతరుల అనుభవాలను తీసుకుని కథను రాసుకున్నాడు.
 
చాలా సింపుల్ గా వున్న కథను రక్తికట్టించే కథనంలో చూపించాడు. ఇందులో పాత్ర పరంగా సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికపరంగా అన్నీ విభాగాలు బాగున్నాయి. ఇక పోటీ ప్రపంచంలో ఇతరులతో పోల్చుకుని వాస్తవాన్ని మరిచి ఆకాశానికి మెట్లు వేయాలనుకుంటే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనేది ఇందులో చక్కగా చూపించాడు. 
 
అయితే ఈ కథ సామాన్యుడికి, మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా వుంటుంది. దానితోపాటు ఫిలాసిఫికల్ టచ్ కూడా వుంటుంది. ఇక్కడ ఎవరు ఎవిరితో ఎంతకాలం వుంటారో తెలీదు. ఏది ఎప్పుడు జరుగుతుందో తెలీదు. తన భార్యతో టూర్ కు వస్తానంటే అడ్డుకున్న సంపత్ ఆ తర్వాత తీసుకెళ్ళినా దానికి తగిన ఫలితం రాకపోవడంతో ఆయన మాట్లాడిన ఫిలాఫికల్ టచ్ ఆలోచింపజేస్తుంది. అదేవిధంగా యజమానిని మోసం చేసి విషయాన్ని ఎలా చెప్పాలో తెలీక సతమమవుతున్న సెల్వం చివరికి చెప్పాక.. ఆయన పాజిటివ్ గా తీసుకోవడంతో చిత్రంలో పాత్రలను చాలా పాజిటివ్ కోణంలో రాసుకున్నాడు.
 
సెల్వం కారు జర్నీలో రూపాయిను ఏ విధంగా సంపాదించాలో అనే విషయాలు కూడా దర్శకుడు టచ్ చేశాడు. షేర్ మార్కెట్ ,ఇన్యూరెన్స్ ఇలా పలు అంశాలను ప్రేక్షకుడికి టచ్ అయ్యేలా వున్నాయి. సాధారణంగా ఇలాంటి సందేశాత్మక సినిమాలలో కథను నెమ్మదిగా వుంటుంది. ఈ సినిమా కుటుంబంలో చూడతగ్గ చిత్రంగా చెప్పవచ్చు.
రేటింగ్ : 3/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
క్వాక్ ఏరీనా పబ్ పార్టీలో నటి హేమ... డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని వివరణ