సంబంధిత వార్తలు
- JDChakravarthi: ఎన్నో గాయాలను తట్టుకుని విడుదలకు సిద్ధమైన గాయపడ్డ సింహం
- Faria Abdulla: సత్య’నుంచి ‘పెళ్లి చూపులు వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం : ఫరియా
- ఇందులో ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డిని కూడా వున్నారు : దిల్ రాజు
- ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి
- JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి
Gayapadda Simham: ఐదుగురు దర్శకులు చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఎలా వుందంటే.. గాయపడ్డ సింహం రివ్యూ
Gaayapadda Simham Poster
సాంకేతికత: ఛాయాగ్రహణం : విద్యాసాగర్ చింత, నిర్మాతలు : కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప,విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్. దర్శకుడు : కశ్యప్ శ్రీనివాస్
కథ :
మధ్యతరగతి దరహాస్ (తరుణ్ భాస్కర్) ఐశ్వర్యవంతురాలైన గాయత్రి (మానస చౌదరి) తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి పెట్టిన కండిషన్ కారణంగా అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కన్సల్టెంట్ ద్వారా అమెరికాకు వెళ్ళిన వెంటనే తిరుగుటపాలో వెనక్కి వస్తాడు. అలా ఎంతోమంది యువత వెనక్కు వచ్చి మీడియా ముందు తమ బాధలు చెప్పుకుంటారు. కానీ దరహాస్ అందులో హైలైట్ అవుతాడు. దాంతో దరహాస్ అమెరికా ప్రెసిడెంట్ పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత కథ ఎటువైపు మలుపు తిరిగింది. ఈ కథలో షాలిని (ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏమిటి? ధర్మ (జె. డి. చక్రవర్తి) ఈ కథకు సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
గాయపడ్డ సింహం లోని పాయింట్ ఈనాటి యూత్ కు బాగా నచ్చుతుంది. చాలామంది యువత, సినిమా నిర్మాతలు, దర్శకులు అమెరికా మోజుతో ఒక్కసారైన వెళ్ళానుకుంటారు. అలా వెళితే అక్కడి రూల్స్ అధ్యకుడు షడెన్ గా మార్చేస్తే వారి ఎమోషన్స్ తో ఆడుకున్న ఆ వ్యక్తి ఏదైనా చేయాలనే ఆలోచనలోంచే పుట్టిన కథ. ఇది సినిమా వరకు ఓకే. నిజంగా చేయాలంటే చాలా కష్టం. అందుకే ముందుగా ఈ సిిమాలోని పాత్రలు, ఆవేశాలు, బ్లాక్ మేజిక్ లు ఏవీ ఫాలో కాకండి. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంటూ స్లయిడ్ వేశారు.
ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలను తరుణంలో ఇటీవల అసలు కథలో పెద్దగా లేకపోయినా మ్యాజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కోవలోనిదే ఈ చిత్రం. హీరో ఫ్రెండ్ గా నటించిన కశ్యప్ శ్రీనివాస్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన విష్ణు ఓయ్, హర్షవర్ధన్ మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ట్రంప్ క్యారెక్టర్‌ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది.
మొదట్లోనే తొలిపరిచయం అంటూ ట్రంప్ వీడియోలు చూపించి ఆసక్తి కలిగించాడు. ముఖ్యంగా శ్రీవిష్ణు ఫ్యామిలీ డ్రామాను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్, అంతే స్థాయిలో మిగిలిన పాత్రలను మరియు సీన్స్ ను జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయాడు. మొత్తానికి స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.
ఇందులో పోకిరి, బొమ్మరిల్లు వంటి పలు సినిమాల స్కూప్స్ గా చూపిస్తూ ఎంటర్ టైన్ చేశారు.
దర్శకుడు తన టేకింగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తి అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా విద్యాసాగర్ చింత చిత్రీకరించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. టైటిల్ కు తగినట్లు యూత్ ఎలా గాయపడ్దారో అనేది తెలియజేసేలా టైటిల్ పెట్టారు. నిజంగా అమెరికాలో ట్రంప్ కొత్త రూల్స్ పెట్టిన టైంలో జరిగిన కథగా రాసుకున్నారు. ఆ బాధతో చాలామంది తిరిగి వచ్చి అబాసుపాలయిన సందర్భాలున్నాయి. అలాంటిది ట్రంప్ ను ఏదో చేయాలనే కసితో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సరదాగా సరికొత్తగా వుంది. ఇదే నిజంగా అప్లయి చేస్తే దేశాల మధ్య యుద్ధాలు జరగవు. ట్రంప్ ను కంట్రోల్ చేయవచ్చు అనే మీనింగ్ కూడా వుంటుంది. మరి దీనికి సీక్వెల్ కూడా వుంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. బహుశా ఈ సినిమా హిట్ అయితే వుంటుందేమో.
రేటింగ్ : 2.5/5
