1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. King of Pop Netizen Reviews: Will Allu Arjun Star in the Michael Jackson Biopic?

King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?

King of Pop  Michael Jackson Biopic watching Allu Arjun at his dolby theater
King of Pop Michael Jackson Biopic watching Allu Arjun at his dolby theater
లెజెండరీ సింగర్, డాన్సర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిన అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా కింగ్ ఆఫ్ పాప్ ఈ ఏప్రిల్ 24న విశ్వవ్యాప్తంగా విడుదలైంది. అదేరోజు హైదరాబాద్ లో కొన్ని పరిమిత థియేటర్లలో విడుదలయింది. ముఖ్యంగా డాల్బీ ఫార్మెట్ లో హైదరాబాద్ లోని అల్లు అర్జున్ కు  చెందిన అల్లు సినిమాస్ లో విడుదలయింది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక్కడే ఆ సినిమాను చూసి తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసుకున్నారు. అయితే చిరంజీవి కూడా చూశారనే వార్తకూడా వినిపించింది. ఆయన చూసినట్లు ఆదారాలు కనిపించలేదు.
 
ఇక ఈ సినిమా గురించి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం.
ఓ సినిమా వేడుకలో దిల్ రాజు, అల్లు అర్జున్ పాల్గొన్న వేడుకలో ఆర్. నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి, అల్లు అరవింద్ ను ఉద్దేశించి.. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథంలో డాన్స్ చూసి నేను మైమరిచిపోయాను. నాకు ఆయనలో మైకేల్ జాక్సన్ కనిపించాడు అని కితాబిచ్చారు. భవిష్యత్ లో అలాంటి సినిమాలో చూడాలనుకుంటున్నానని తెలిపారు. మరి అల్లు అర్జున్ కింగ్ ఆఫ్ పాప్ సినిమా చూశాక అలాంటి ప్రయోగం చేస్తాడో లేదో చూడాలి.
 
మైఖేల్ జాక్సన్ బయోపిక్ గురించి.
అల్లు అర్జున్ 'మైఖేల్' సినిమా చూస్తున్నారన్న ఇటీవలి ప్రచారం, పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ పట్ల టాలీవుడ్‌కు ఉన్న శాశ్వతమైన అభిమానాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. దశాబ్దాలుగా, తెలుగు సినిమా MJ యొక్క ప్రత్యేక శైలిని—ముఖ్యంగా ఆయన ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్స్‌ను—స్వీకరించి, ఆరాధించి, పునఃవ్యాఖ్యానిస్తూ వస్తోంది. దీనికి చాలా కాలం ముందు, మెగాస్టార్ చిరంజీవి 'దొంగ' చిత్రంలో "గోలిమార్" అనే చార్ట్‌బస్టర్ పాటతో MJకి ఒక చిరస్మరణీయ నివాళి అర్పించారు. ఈ పాట 'థ్రిల్లర్' నుండి ప్రేరణ పొందిందని విస్తృతంగా నమ్ముతారు.
 
కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైఖేల్ (Michael). మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటిస్తున్నారు.
 
వరల్డ్ పాప్ కింగ్ జాక్సన్ బయోపిక్‌ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ నిర్మించారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ కొన్ని విషయాలు వెల్లడించారు. 
 
వారు పేర్కొన్న దానిని బట్టి చూస్తే,. మైఖేల్ జాక్సన్ పాత్రలో నటించిన జాఫర్ జాక్సన్, కాల్మన్ డొమింగో అద్బుతమైన నటనను ప్రదర్శించారు. ఆయన హావభావాలు తన మేనమామయ్య లా కనిపించాడు. ఆయన కాస్ట్యూమ్స్ పరంగా తీసుకున్న కేర్ బాగుంది. తెర మీద మైఖేల్ జాక్సన్, ఆయన తండ్రిని చూస్తున్నామా? అనేంతగా నటించారు. విజువల్ పరంగా, మ్యూజిక్ పరంగా సూపర్ ఎంజాయ్‌బుల్, చాలా బాగుంది. మైఖేల్, ఆయన తండ్రి మధ్య వచ్చే విభేదాలు సినిమాకు బ్యూటీగా మారింది. కాస్మోటిక్ సర్జరీ తదితర అంశాలు సినిమాకు బలంగా మారాయి. ఆయన జీవితాన్ని 2 గంటల్లో చూపించడం కష్టమే అనిపించింది అంటూ సుదీర్ఘమైన రివ్యూను నెటిజన్ రాశారు.
 
మైఖేల్ మూవీని చూశాను. జాఫర్ జాక్సన్, కాల్మన్ డొమింగో ఆ పాత్రలకు సరిగ్గా సరిపోయారు. ఇంకా వారి పెర్ఫార్మెన్స్ నన్ను వెంటాడుతున్నది. ఈ సినిమాను రెండోసారి కూడా చూస్తాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
 
అయితే కొందరు నెగెటివ్ కూడా స్పందించారు. 
మైఖేల్ సినిమా చూసి నిరాశ చెందాను. పాఠ్యాంశంగా మాదిరిగా ఉన్న బయోపిక్‌లో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. లెజెండరీ పాప్ సింగర్ జీవితాన్ని చెప్పే సమయంలో ఉండాల్సిన గ్రౌండ్ రియాలిటీ కనిపించలేదు. కానీ జాఫర్ జాక్సన్ ఎక్సలెంట్‌తో ఆకట్టుకొన్నాడు. తన మామ పాత్రలో అద్బుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. 80వ దశకంలోని మైఖేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కు మాత్రమే కనెక్ట్ అవుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
 
ఇదిలా వుండగా, పూర్తిగా జాక్సన్ జీవితంలోని ఘటనలు కాకుండా కొన్ని సంఘటలను మాత్రమే చూపించారని విమర్శ విశ్లేషకులనుంచి వచ్చింది. 
 
సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే అప్పటి మైఖేల్ జాక్సన్ ని మళ్ళీ చూసినట్టు పాప్ ఫ్యాన్స్ చెబుతున్నారు. మైఖేల్ మాట, డాన్స్, సాంగ్స్ ఇలా అన్నిటిలోని జాఫర్ తనని ప్రతిబింబించేలా చేయడంతో సినిమా చూసినవారు మాత్రం జాఫర్ కోసం మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఇది మాత్రం తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అనుకోవచ్చు. ఇక పార్ట్ 2 లో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక పార్ట్ 2 వుంటుందో లేదో కూడా ఇంకా తెలియాల్సి వుంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు