సంబంధిత వార్తలు
- Rakasa Review: భయపెట్టి వినోదాన్ని పంచే డీసెంట్ చిత్రం రాకాస - రాసాక రివ్యూ
- Karmeni Selvam Review: సముంద్రఖని నటించిన కార్మేని సెల్వం ఎలా వుందంటే... కార్మేని సెల్వం రివ్యూ
- Biker Review: బైక్ రేసింగ్ రైడ్ తో శర్వానంద్, రాజశేఖర్ గట్టెక్కించారా - బైకర్ రివ్యూ
- Ustaad Bhagat Singh Real Review: ఉస్తాద్ భగత్ సింగ్ యుగాదికి కాలర్ ఎగరేశాడా? లేదా? రియల్ రివ్యూ
- Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ.. మాస్ మూవీ లవర్స్‌కు ఉగాది జాతర
కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ
Ichata love ammabadunu konabadunu relese posters
కథ:
విక్కీ ఓ ఇది ఒక చైన్ స్నాచర్. ప్రతిదీ డబ్బుతో ముడిపెడుతూ వుండే తను ప్రేమను కూడా ఆ యాంగిల్ లోనే చూస్తాడు. ఒక క్రిమినల్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి, మరోవైపు ప్రేమను కేవలం ఒక ప్రాజెక్ట్‌లా చూస్తున్న వ్యక్తి,. వీరి ప్రయాణాలు ఎలా ఒకదానికొకటి ముడిపడతాయి అన్నదే అసలైన కథ. ప్రేమను డబ్బుతో కొనే యుగంలో మనం జీవిస్తున్నామా? లేక అది ఇంకా భావోద్వేగాలకు సంబంధించినదేనా? అనే ప్రశ్నలను సినిమా ముందుకు తీసుకొస్తుంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
ప్రేమయినా పెళ్లయినా నేడు డబ్బు, హోదా చుట్టూనే తిరుగుతుంటుంది. ఇది కాదనేలేని సత్యం. దానిని బేస్ చేసుకుని దర్శకుడు రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. అంజనీదాస్ ఈ కథను చాలా రియలిస్టిక్‌గా, కొంత బోల్డ్‌గా కూడా తెరకెక్కించారు. డైలాగ్స్ నేటి యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ప్రతి సీన్‌లోనూ ఒక నేచురల్ ఫ్లో కనిపిస్తుంది. కొన్నిచోట్ల సెన్సార్ పరిమితులను దాటి వెళ్లే సన్నివేశాలు ఉన్నా, అవి కథలో భాగంగా సహజంగా అనిపిస్తాయి. కొత్త తరహా కథలను ప్రయత్నించడంలో దర్శకుడి ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది.
అంతా కొత్తవాళ్లు అయినప్పటికీ వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. సుధాకర్ మాస్కూరి విక్కీ పాత్రలో ఒక రఫ్‌నెస్, ఎమోషనల్ డెప్త్ రెండింటినీ బాగా చూపించారు. శివరాజ్ శంకర్ తన పాత్రలో ఒక నేచురల్ హీరోయిజం చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు. కృతి ఆర్ భట్ మరియు నివిక్ష నాయుడు తమ పాత్రల్లో ఫ్రెష్‌నెస్ తీసుకువచ్చారు. అనుభవం తక్కువగా ఉన్నా, కాన్ఫిడెన్స్‌తో నటించడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
సాంకేతికంగా చూస్తే, సినిమాటోగ్రఫీ పరంగా విజువల్స్ కొత్తగా ఉన్నాయి.. సంగీతపరంగా చూస్తే, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు బలం ఇచ్చింది. ఎడిటింగ్ వేగంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన సన్నివేశాలను వివరంగా చూపించాలని దర్శకుడు సమయం తీసుకున్నాడు అక్కడ కొద్దిగా నెమ్మదిగా అనిపించే భాగాలు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా పెద్ద స్థాయిలో లేకపోయినా, కథ కథనం ఆ లోపాలను కనిపించనివ్వదు.
హెల్మెట్ లేని ప్రేమ ప్రమాదకరం అంటూ పోస్టర్లతో ఆసక్తి కలిగించిన ఇలాంటి కథలు యూనిక్ పేరుతో బోల్డ్ కాన్సెప్ట్ తీసుకుని దర్శకుడు మలిచాడు. ఫస్ట్ హాఫ్‌లో ఎనర్జీ, చైన్ స్నాచింగ్ సీన్స్ గురించి తెలీని విషయాలు చెప్పినట్లయింది. సంభాషణల పరంగా పర్వాలేదు. సహజంగా వుండేలా టేకింగ్ తో తీసిన ఈ చిత్రం సమాజంపై కొన్ని ప్రశ్నలతో ఆలోజింపచేస్తుంది. ప్రధానలోపాలుగా నిర్మాణ విలువలు మరింత మెరుపరుచుకుంటే బాగుండేది. ఇక బోల్డ్ సన్నివేఆలు అన్నీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు.
టోటల్ గా చూస్తే, ఈ చిత్రం ఒక సాధారణ ప్రేమ కథ మాత్రం కాదు, దాని లోపల సమాజ సంబంధాలపై సందేశం తెలిపేట్లుగా వుంటుంది. ఇలాంటి బోల్డ్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో దర్శక నిర్మాతలు లోటుపాట్లు గ్రహించి తదుపరి సినిమాకు సరిచేసుకుంటే బాగుంటుంది. యూత్ ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
