సంబంధిత వార్తలు
- Sree Vishnu: నిజాయితీగల కంటెంట్ ఇస్తే శుక్రవారం మనదే అవుతుంది :శ్రీ విష్ణు
- Allari Naresh: నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్ : అల్లరి నరేష్
- Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్
- మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం
- Thiruveer: పాపం ప్రతాప్ కు ప్రశంసలే కాదు డబ్బులూ వస్తాయి : తిరువీర్
Paapam Pratap Review: పాపం టీవీ విన్, అయ్యో పాపం ప్రతాప్ - పాపం ప్రతాప్ రివ్యూ
Thiruveer, Payal Radhakrishna
సాంకేతికత: ఛాయాగ్రహణం : విశ్వేశ్వర్ ఎస్ వీ, సంగీతం : కె.ఎమ్. రాధాకృష్ణన్, నిర్మాత : మిత్రవింద మూవీస్, దర్శకుడు : ఎస్.పి. దుర్గా నగేష్
నేటివిటీ పేరుతో మారుమూల గ్రామీణ కథలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఈటీవీ విన్ పలు కుటుంబకథా చిత్రాలు తీసి మెప్పించింది. మరి ఈసారి పాపం ప్రతాప్ అనే సినిమా తీశారు. ట్రైలర్ లోనే అది ఫ్యామిలీ సినిమా కాదని అనిపించింది. మరి అందులో ఏముంది? తిరువీర్ తనకు సక్సెస్ సరిగ్గా రాలేదని బాధపడుతున్న తరుణంలో పాపం ప్రతాప్ ఏప్రిల్ 17, 2026 శుక్రవారం విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
కథ:
స్కూల్ డేస్ నుంచి ప్రతాప్ (తిరువీర్) బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఇష్టపడతాడు. అతని తండ్రి ఊరిలో ఎరువుమందుల వ్యాపారి. ప్రతాప్ పెద్దయ్యాక తండ్రికి ఇష్టంలేకపోయినా ప్రేమించిన బుజ్జమ్మను పెండ్లి చేసుకుంటాడు. మూడు రాత్రులు శక్తిమాన్, వీర ప్రతాప్ లెవల్ లో బిల్డప్ లు ఇస్తాడు. నాలుగోరోజు ఊరిలో బుజ్జమ్మ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి ప్రతాప్ తో కలిసి వుండలేనని చెప్పేస్తుంది. ఎందుకు? అనేది క్లారిటీ ఇవ్వడు. దానితో ప్రతాప్ కు అసలు విషయం లేదని ఊరంతా ప్రచారం జరుగుతుంది.
కొద్దిరోజులకు తనను అవమానిస్తున్నారని బుజ్జమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. ప్రతాప్ నిద్రలో ఒక వింత సమస్యతో భార్యకు బాధిస్తుంటాడు. అది ఎందుకు అతనికే వచ్చింది. దానికోసం ఎటువంటి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు? చివరికి వారిద్దరూ కలిసి జీవించారా? లేదా? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
సినిమా కథలో హీరోకున్న సమస్య ఊరిలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా అని చెప్పారు. అయితే అలాంటి సమస్య రాత్రి పూటే రావడం కూడా చిన్నతనంలో ఎదుర్కొన్న ఘటనలే కారణంగా చెప్పారు. కేవలం ప్రతాప్ కున్న సమస్యను తెలుసుకోవడం కోసం సగంపైగా కథ అయిపోతోంది. అది ప్రేక్షకుడికి టార్చర్ లా అనిపిస్తుంది. రాత్రి మందుతాగి అల్లరిఅల్లరి చేసే కొంతమంది వ్యక్తులు తెల్లారాక తనకేమీ తెలీయదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. తాగకపోయినా మెదడులో డిజాస్టర్ వల్ల ఈ వింత జబ్బు వస్తుందని దానికి మందే లేదని సెకండాఫ్ లో డాక్టర్ అవసరా శ్రీనివాస్ తేల్చేస్తాడు.
ఇక ఈ కథలో గోపరాజు పాత్ర చాలా చీప్ గా వుంటుంది. ఈటీవీ వంటి సంస్త నుంచి వస్తున్న సినిమా కాబట్టి కొంచెమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. గోపరాజు పాత్ర టూరింగ్ టాకీస్ లో షకీలా సినిమా వీక్ నెస్ వుంటుంది. ఇలాంటి పుస్తకాలు చదువుతూ టైంపాస్ చేస్తుంటాడు. కన్న కూతురు పెండ్లి సంబందం మాట్లాడానికి వచ్చినా పట్టించుకోకుండా రికార్డింగ్ డాన్స్ కు వెళ్ళిపోతాడు. ఇది ఇప్పటి ఈటీవీ విన్ యాజమాన్య లోపంగా కనిపిస్తుంది.
కొడుక్కుని నిద్రలో సమస్య వుందని తెలిసినా తల్లిదండ్రులు కోడలికి చెప్పరు. ఆమెనే తప్పుగా చూపించడం ప్రధాన లోపం. చివరిలో తనకు తెలుసునని కొడుకు గురించి తల్లి కోడలికి చెబుతుంది. ఇలా ఏదో సమస్యవుందని ప్రేక్షకులను మైమరిపించి సాగదీశారు.
ఇందులో నటించిన తిరువీర్, అజయ్ ఘోష్ పాత్రలే కీలకం.. వారు పూర్తి న్యాయం చేశారు. ప్రతాప్ తల్లిగా రాశి నటించింది. బుజ్జమ్మ గా పాయల్ రాధాకృష్ణ నటించింది. ఓ షాట్ లో ఇద్దరూ ఒకే ఏజ్ లా అనిపిస్తారు. ప్రతాప్ స్నేహితుడిగా చేసిన వ్యక్తి పర్వాలేదు. ఇలా రకరకాల పాత్రలుు ఊరిలో వుంటాయని, వారు ఇలా బిహేవ్ చేస్తారని దర్శకుడు నరేష్ చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.
కథలో భాగంగా వచ్చే పాటలు బాగున్నాయి. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లు పర్వాలేదనిపిస్తాయి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ విలేజ్ విజువల్స్ ని బాగా చూపించారు. కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది.
దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ తాను రాసుకున్న కథకు న్యాయం చేశాడని అనుకున్నా దానిని కథనంలో సరైనవిధంగా ప్రేక్షకుడికి కనెక్ట్ చేయలేకపోయాడు. మెంటల్ డిజాస్టర్ అనేది హైలైట్ చేసి దానికి పరిష్కారం చేయకుండా వదిలేయడం పెద్ద లోపమే. తప్పలేదు కానీ అపరిచితుడు లా రాత్రిళ్ళు ప్రతాప్ బిహేవ్ చేస్తాడని తప్పడంలేదు. ఆ పాయింట్ ను మరింత కొత్తదనంగా తీస్తే బాగుండేది. పేరుకు తగ్గట్టు పాపం ప్రతాప్ అనేది కరెక్ట్ గా పెట్టడం విశేషం. ఇలాంటి సినిమాలు ఈనాటి జెంజీకి అస్సలు ఎక్కదు. విలేజ్ వారికి ఇలాంటి కథలు మామూలే. పట్టణాల్లో వుండేవారికి ఇది అస్సలు సచ్చదు.పిల్లలతో సినిమాలు చూడలేం. మరి ఎవరికోసం ఈ సినిమా తీశారో పెద్ద ప్రశ్నే.
రేటింగ్ : 1.5/5
