1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Producer of Kiran Abbavaram's Thimmarajupalli TV Review

Thimmarajupalli TV Review : కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం రివ్యూ

Timmarajupalli TV team poster
Timmarajupalli TV team poster
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు.వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా శుక్రవారంనాడు 17వ తేదీన విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ:
టీవీలు అప్పుడప్పుడే వస్తున్న కాలంలో తిమ్మ‌రాజు ప‌ల్లి అనే చిన్న ఊరి క‌థ ఇది. ఊరికి పెద్ద రామ‌చంద్ర‌య్య (అమ్మ ర‌మేష్‌). ఆ ఊర్లోని స‌తీష్ (సాయి తేజ్‌) హుషారైన కుర్రాడు. చిన్న చిన్న దొంగ‌త‌నాలు కూడా చేస్తుంటాడు. అదే ఊర్లోని శార‌ద (వేదా జ‌లంధ‌ర్‌)ని ప్రేమిస్తాడు. ఊరికి టీవీ ని అద్దెకు తీసుకురావాలన్నా, అందులో సినిమా కేసెట్లు తేవాలన్నా సతీష్ ధిక్కు. అలాంటి టైంలో స్వంతంగా టీవీ, డిష్ కూడా ఇంటికి అమర్చి ఊరిజనాల దగ్గర డబ్బు వసూలు చేస్తుంటాడు  రాజ‌ప్ప (ప్ర‌దీప్ కొట్టే). ఇది అవమానంగా భావించిన రామచంద్రయ్య తనూ టీవీ కొంటానని శపథం చేస్తాడు. కానీ అదేరోజు రాత్రి.. రాజ‌ప్ప ఇంట్లో దొంగలు పడి టీవీని లేపేస్తారు. తెల్లారాక పంచాయితీలో ఆ దొంగతనం రమేష్ పై పడుతుంది. రమేష్ తల్లిని కూడా నిందిస్తారు. దానితో మరింత అవమానంగా భావించిన రమేష్ అసలు టీవీ దొంగనిపట్టుకుంటానని సవాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏమయింది. అనేది సినిమా. 
 
సమీక్ష:
టైటిల్ లో చెప్పినట్లే తిమ్మరాజుపల్లి లో టీవీ గురించే కథంతా. దానికోసం గ్రామస్తుల ఆరాటం, సర్పంచ్ ఇగో ఇతరత్ర పాత్రల ప్రవర్తనల చుట్టూ కథ సాగుతుంది. అప్పట్లో 80 కాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలలో చిత్ర‌ల‌హ‌రి, అన్వేషిత‌, శ‌క్తిమాన్‌… ఇలాంటి కార్య‌క్ర‌మాలతో ఎన్నో అనుబంధాలున్నాయి. శివరాత్రి తదితర పండుగల టైంలో విసిఆర్. కేసెట్లు వేసుకుని సినిమాలు చూస్తుండేవారు. అలాంటి అనుభవాలు దర్శకుడు చక్కడా ఆవిష్కరించారు. మధ్యలో రమేష్ ప్రేమకథ, ఆమె అన్న వ్యతిరేకత ఇలా కొంత భాగం సాగాక ఇంటర్ వెల్ ముందు టీవీ పోతుంది. 
 
ఇక ద్వితీయార్థంలో టీవీ దొంగ‌ను ప‌ట్టుకోవ‌డానికి స‌తీష్ చేసే ప్ర‌య‌త్న‌మే క‌నిపిస్తుంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు అనుమానం పడడం వంటి సన్నివేశాలతో కథను నడిపారు. ఒకే పాయింట్ తో రెండు గంట‌ల కథ న‌డిపిన‌ప్పుడు స‌హ‌జంగానే కొన్ని త్రోటుపాట్లు వ‌స్తుంటాయి. ఈ క‌థ‌లోనూ అదే జ‌రిగింది. క‌థ అక్క‌డ‌క్క‌డే త‌చ్చాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. ప‌ల్లెటూరి క‌థ‌లు చెబుతున్న‌ప్పుడు, ఆయా పాత్ర‌ల నుంచి వినోదాన్ని పుట్టించే ఛాన్స్ ఎక్కువ‌. కానీ ఈ సినిమాలో ఆ ప్ర‌య‌త్నం అర‌కొర మాత్ర‌మే జ‌రిగింది.  
 
దాదాపు 40 మంది నూత‌న న‌టీన‌టులు ఈ సినిమాతో ప‌రిచ‌యం అయ్యారు. రాయలసీమ మాండలికంలో వారి మాట్లాడని మాటలు, పాత్రల తీరు సహజంగా వుంది. కొత్తవారు కాబట్టి వారికి తగు ట్రైనింగ్ ఇచ్చి మరీ నటింపజేయడంతో మరింత నాచురల్ గా నటన కనిపిస్తుంది. ఊరి పెద్దగా అమ్మ ర‌మేష్ న‌ట‌న ఆక‌ట్టుకొంటుంది. కొత్త న‌టీన‌టుల‌తో సింగిల్ టేక్ షాట్స్ పెట్టడం చాలా రిస్క్‌. కానీ న‌టీనటుల‌పై న‌మ్మ‌కంతో ద‌ర్శ‌కుడు ఆ ధైర్యం చేశాడు. ఈ న‌ల‌భై మందిలో కొంద‌రైనా కొత్త అవ‌కాశాలు చేజిక్కించుకొంటారు.
 
దర్శకుడు టేకింగ్, కెమెరా తగినవిధంగా పనితనం బాగుంది.  సంగీత ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమా.కావడంతో  హృద్యంగా బాణీలు ఇచ్చాడు. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం  కెమెరామెన్‌ ప్ర‌తీ ఫ్రేములోనూ తీసుకొచ్చాడు మాట‌లు స‌హ‌జంగా కుదిరాయి. నిర్మాత‌గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం అభిరుచిని, ఆద‌ర్శాన్ని, కొత్తవారితో చేసి వారిని లైఫ్ఇవ్వాలన్న ముందుచూపు అభినందించదగిందే. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఎంత పే చేస్తుందనే దానికన్నా నిజాయితీగా, సహజంగా ఉట్టిపడేలా చేసిన సినిమా ఇది.
 రేటింగ్ : 2.75/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
JD Ckaravarthi: చేతబడి ఐదు భాషల ఆడియో రైట్స్ దక్కించుకున్న సెన్సేషన్ సరిగమ