1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Samantha starrer Ma Inti Bangaram Movie Review is worth watching

Ma Inti Bangaram Review: చూడతగ్గ చిత్రంగా స‌మంత నటించిన మా ఇంటి బంగారం సినిమా రివ్యూ

Maa Inti Bangaram Movie  Samantha
Maa Inti Bangaram Movie Samantha
నటీనటులు: సమంత, గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంధ్, శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, వెన్నెల కిషోర్, చైతన్య, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు 
సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, దర్శకత్వం: నందినీ రెడ్డి నిర్మాతలు: రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కథ, స్క్రీన్ ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్, ఫైట్స్: లీ విట్టేకర్, రిలీజ్: 2026-06-19
 
శుభం సినిమాలో ఓ పాత్ర పోషించిన సమంత ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా మా ఇంటి బంగారం. నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన నిర్మాణ సంస్థతో నిర్మించిన చిత్రం నేడు విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
బల్లవరం అనే ఊరిలో పెద్ద కుటుంబానికి  చెందిన అనిరుధ్ (దిగంధ్) ఓ డాక్టర్. ఇంటిలో తెలీకుండా స్వర్ణ(సమంత)ను వివాహం చేసుకుని చాలా కాలం ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అయితే అనిరుధ్ చెల్లెలు పెళ్లి నిశ్చితార్థం రోజు స్వర్ణను తీసుకుని ఊరికి వస్తాడు అనిరుద్. అనిరుద్‌ది పెద్ద ఫ్యామిలీ. తండ్రి, తల్లి (గౌతమి), మరదలు (అనసూయ), చెల్లెల్లు, బావలు, బామ్మ పరివారం. అనిరుద్ తండ్రి  రామరాజు (ఆనంద్) ఊరిలో రాజకీయనాయకుడు.
 
ఇక ఇంటికి వచ్చాక తండ్రిని తప్పితే అందరూ స్వర్ణ, అనిరుద్‌లను స్వాగతించే విధానంతో తనకు ఓ మంచి ఫ్యామిలీ వుందని స్వర్ణ ధైర్యంగా వుంటుంది. ఇదిలా వుండగా, రామరాజుతో అదే ఊరికి చెందిన మధుసూధన్ (వడ్లమాని శ్రీనివాస్) రాజకీయాల్లో రాణించాలనుకుంటే రామరాజు అడ్డుపడుతున్నాడనే కసి. ఇక మరోవైపు ఓసారి గుడికి వెళితే అక్కడ ఎవరో తనను ఫాలో అవుతున్నారని భ్రమించి స్వర్ణ వారికి బుద్ధి చెబుతుంది. ఇదేదో రాజకీయ గొడవ అనుకుంటాడు రామరాజు. ఆ తర్వాత మరోసారి స్వర్ణను టార్గెట్ చేస్తూ ఓ గ్రూప్ వస్తుంది. ఆ తర్వాత ఏమయింది? అసలు స్వర్ణను వెతుక్కుంటూ వారెందుకు వచ్చారు? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
స్వర్ణ, అనిరుధ్‌ల పరిచయంతో భార్యభర్తల మధ్య వున్న అనుబంధంతో దర్శకురాలు నందినీరెడ్డి బాగా డీల్ చేసి కథను నడిపారు. అయితే ఈ కథంతా చూస్తే, హీరోయిజం వున్న పాత్రను సమంత చేస్తే ఎలా వుంటుందో అనేది ఈ సినిమా కథ. ఇందులో మహిళగా ఆమెకున్న పరిమితులు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు టచ్ చేస్తూ కథనాన్ని నడిపించారు. 
 
అనిరుద్ కుటుంబ సభ్యురాలిగా ఎంట్రీ ఇచ్చాక అక్కడ తన కంటే చిన్న కోడలుకే పెద్ద పీటవేయడంతో సమంత ఏవిధంగా బిహేవ్ చేసింది, ఆమె చేసిన ప్లాన్స్ అన్నీ చాలా ఎంటర్ టైన్ చేస్తాయి. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌తో స్వర్ణకున్న గతంలో మలుపు బాగుంది. అయతే ఒకవైపు ఎంటర్టైన్మెంట్, మరోవైపు సీరియస్ రాజకీయాలు, ఇంకోవైపు నక్సలిజం వంటి అంశాలను కలిపి సామాన్యుడిని కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు.
 
నిర్మాత రాజ్ నిడిమోరు పర్‌ఫెక్ట్ రైటింగ్‌ సపోర్ట్‌తో నందిని రెడ్డిలో కొత్త కోణం సమంతలో కనిపించింది. కథ ప్రకారంగా నటీనటుల ఎంపిక ఫ్రెష్‌గా ఉండడంతో కథనం రక్తికట్టింది. దాని వల్ల స్క్రీన్ మీద ప్రెష్‌నెస్ కనిపించింది. ద్వితీయార్థంలో స్వప్న పాత్ర రిలీవ్ అయ్యే విధానం. మరోవైపు నగ్జలైట్ నాయకుడు ఆమెను టార్చెర్ పెట్టడం వంటివి డీల్ చేసే విధానం ఆకట్టుకుందనే చెప్పాలి.
 
సమంత ఇంతకుముందు యశోద సినిమాతో మంచి ఇమేజ్‌ను తెచ్చుకొన్నారు. ఇక ఈ సినిమాలో అంతకుమించి అన్నట్లుగా సరికొత్తగా కనిపించారు. యాక్షన్, ఫన్, ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలు ఉన్న పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. మొత్తంగా సమంత అంతా తన భుజాలపై వేసుకుని సినిమాను నడిపించింది. ఇందులో నటించిన పాత్రలన్నీ బాగా నడిపించారనే చెప్పాలి.
 
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. డాన్స్ పరంగా సమంత బాగా చేసింది. పాటలు, సాహిత్యం, మాటలు సింపుల్ గా అర్థమయ్యేట్లుగా వున్నాయి. ఎక్కడా రణగొణ ధ్వనులు లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ బాగా డీల్ చేశారు. గ్రామీణ నేపథ్యం పరిసరాలు సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్ బాగా క్యాప్చర్ చేశారు. పెళ్లి ఇంటిని డిజైన్ చేసిన విధానం ఆర్ట్ విభాగం టాలెంట్‌ను చూపించింది.  రాజ్ నిడిమోరు, హిమంక్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్‌నెస్‌ను, క్వాలిటీని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాను కుటుంబంతో హాయిగా చూడతగ్గ చిత్రంగా చెప్పవచ్చు.
 
ఇలాంటి కథలు హీరోను బేస్ కొన్ని రచయితలు రాస్తుంటారు. అలాంటివి ఇంతకుముందు విజయశాంతి బేస్ చేసుకుని లేడీ ఓరియెంటెడ్ కథలు వచ్చాయి. ఆ తర్వాత అనుష్క ఇలా కొంతమంది మాత్రమే చేయగల కథలుంటాయి.అందులో సమంత మాత్రమే చేయగల కథ మా ఇంటి బంగారం. 
రేటింగ్ : 3/5
About Writer
దేవీ