1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Sandigdham' Movie Review: A Mystery-Thriller Starring Nihal and Priya Deshpande

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sandhigdham
Sandhigdham
నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సందిగ్ధం. తెరచేప ఫేమ్ నవీన్ సంకరపు విలన్. సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ నుంచి మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా మెప్పించిందో చూద్దాం.
 
కథ:
అడవులు, కొండల ప్రాంతంలోని ఓ గ్రామంలో దేవ్ (నిహాల్), మేఘన (ప్రియా దేశ్‌పాగ్) జీవిస్తూ ఉంటారు. గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ దేవ్ అక్కడ హాస్పిటల్ నిర్మిస్తాడు. ఒక రోజు గాయాలతో సత్య (అర్జున్), కళ్యాణి (కాజల్ తివారి) వారికి ట్రీట్ మెంట్ చేస్తాడు. వారి గురించి తెలుసుకుని  దేవ్ ఆశ్రయం కల్పిస్తాడు. అయితే  ట్విస్ట్ ఏమంటే, సత్య, కళ్యాణి గ్రామంలోని ఇతరులకు కనిపించకుండా కేవలం దేవ్‌కి మాత్రమే కనిపిస్తారు.
 
అయితే దేవ్ అసలు ఎవరు? ఇక్కడే ఎందుకు ఆసుపత్రి కట్టాడు. అతనికి మాత్రమే కనిపిస్తున్న వారి గతం ఏమిటి? దేవ్ జీవితంతో వారికి ఉన్న సంబంధం ఏంటి? వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో సినిమా ముందుకు సాగుతుంది.
 
సమీక్ష: 
ఇందులో ఆసక్తికరమైన అంశం క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ దేవ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడనేది. సహజంగా కథ పాత్రల పరిచయంతో మొదటి భాగం సరిపోతుంది. గ్రామీణ నేపథ్యం కనుక ప్రక్రితి అందాలు బాగా చూపించారు. దేవ్ మానవీయ కోణం, మేఘనతో ప్రేమ కథ, గ్రామ జీవితం వంటి అంశాలు సహజంగా చూపించారు. సాఫీగా సాగుతున్న కథనం ఒక్కసారిగా సత్య, కళ్యాణి పాత్రలు ఎంట్రీ తో మారిపోతుంది. దానితో ఇంటర్వెల్ లో వచ్చే మలుపు క్రేజ్ క్రియేట్ చేస్తుంది. ఇక  సెకండాఫ్‌లో అసలు కథ రివీల్ అవుతూ థ్రిల్లింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. క్రైమ్, సస్పెన్స్ కథ కనుక దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ భాగాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
 
ఇందులో దేవ్ గా నిహాల్ కు మంచి మార్కులు పడతాయి. నటుడిగా సన్నివేశాలలో మెప్పించాడనే చెప్పాలి. మేఘన పాత్రలో ప్రియా దేశ్‌పాగ్ అటు గ్లామర్ తోపాటు నటన కనబరిచింది.  అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో సహజమైన నటనతో మెప్పించారు. విలన్‌గా నవీన్ సంకరపు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర నటీనటులు కథ ప్రకారమే చేశాయనే చెప్పాలి.
 
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ ఇటువంటి గ్రామీణ నేపథ్యాలకు కీలకం. కెమెరామెన్ తన పని బాగా చేయగలిగాడు. అడవులు, కొండ గ్రామం విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. సంగీతపరంగా  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథతోపాటు రన్ అయ్యాయి. కొన్ని సంభాషణలు ఆలోచింపజేశాయి.  చిన్నపాటి లోపాలున్నా దర్శకుడు కథను తన శైలిలో చెప్పాడు. సహజంగా మిస్టరీ, థ్రిల్లింగ్ పాయింట్ ను చెప్పే ప్రయత్నంలో గత చిత్రాలను బేరీజువేసుకుని కొత్తగా చేయాలి. ఆ ప్రయత్నం దర్శకుడు చేశాడు. సరికొత్త కథను చూడాలనుకున్నవారికి ఇది నచ్చుతుంది.
 రేటింగ్ : 3/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్