సంబంధిత వార్తలు
- Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ
- Deewana review : భిన్నమైన నేపథ్యంగా దీవానా చిత్రం రివ్వ్యూ
- Ma Inti Bangaram Review: చూడతగ్గ చిత్రంగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా రివ్యూ
- Kotha Malupu review : సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు కొత్త మలుపు మూవీ రివ్యూ
- Sing Geetham Review: ఆసక్తిగా మలిచిన సింగీతం శ్రీనివాస్ చిత్రం... సింగ్ గీతం రివ్యూ
Risk Review : ఘంటాడి క్రిష్ణ చేసిన రిస్క్ ప్రేక్షకులకు మరింత రిస్క్.. రివ్యూ
Risk crew: Sandeep Ashwa, Sanya Thakur, Zoya Zaveri, Rajeev Kanakala
సాంకేతికత: ఛాయాగ్రాహకుడు : జగదీష్ కొమరి, సంగీత దర్శకుడు : ఘంటాడి కృష్ణ, ఎడిటర్ : శివ శర్వాణి, నిర్మాతలు : ఘంటాడి కృష్ణ, గుర్రం నర్సింహులు, రావి సురేష్ రెడ్డి, దర్శకుడు : ఘంటాడి కృష్ణ
అప్పుడెప్పుడో 6టీన్స్ అనే సినిమాతో సంగీత దర్శకుడిగా పరియమై కొద్ది రోజులపాటు పేరు తెచ్చుకున్న ఘంటాడి కృష్ణ చాలా కాలం సినిమారంగానికి దూరంగా వున్నారు. చాలా ఏళ్ళనాడు అంటే డీమానిటేషన్ ముందు రిస్క్ అనే సినిమాకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. అది ఎట్టకేలకు 2026, జూన్ 26న విడుదలకు సిద్ధమైంది. ఏ గేమ్ ఆఫ్ యూత్ అనే కాప్షన్ కూడా జోడించారు. అంతా కొత్తవారితో తీసిన సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
కార్తీక్ (సందీప్ అశ్వ) అతని ముగ్గురు స్నేహితులు మోసాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. మాజీ మిస్ ఇండియా సందలి అరోరా (జోయా జవేరి)కి దగ్గరవ్వాలనే ఉద్దేశంతో, వారు మ్యూజిక్ వీడియో మేకర్లుగా నటిస్తారు. అయితే, సందలి తన భర్త ప్రదీప్ చక్రవర్తి (అనీష్ కురువిల్లా)ని అంతం చేయమని వారిని కోరడంతో వారి ప్లాన్ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమె తన భర్తను ఎందుకు చంపాలనుకుంటుంది? ఆ నలుగురు ఆమె ప్రతిపాదనను అంగీకరిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు మిగిలిన కథలో తెలుస్తాయి.
సమీక్ష:
సినిమా అంటే ఓ సూత్రం వుంటుంది. దాని కోసం ఎన్నో ఏళ్ళుగా దర్శకుల దగ్గర పనినేర్చుకుని దర్శకుడు కావడం ఆనవాయితీ. కానీ మారిన ట్రెండ్ ను బట్టి యూత్ యూట్యూబ్ లో రీల్స్ చేస్తూ దర్శకులు అవుతున్నారు. కానీ, సంగీత దర్శకుడిగా పేరున్న ఘంటాడి సినిమాకే దర్శకుడు కావడం విశేషం. ఇందుకోసం నలుగురు కొత్త కుర్రాళ్ళను ఎంచుకున్నారు. వారితో ఆయన చేయించిన విన్యాసాలు మామూలుగా లేవు. పరమ చెత్తగా వుంటాయి.
ఏ సన్నివేశం కూడా చూడాలనిపించేలా వుండదు. ఇన్ ఫోసిస్, టెక్ మహేంద్ర వంటి కంపెనీలలో బ్యాక్ గేట్ నుంచి ఉద్యోగాలకు వెళ్ళినవారిని చూశాం. అలా హరో సందీప్ అశ్వ ఓ కన్ సల్టెంట్ కంపెనీ పెట్టి మోసం చేయడమే పెద్ద బ్లండర్ మిస్టేక్. అతని దగ్గరకు వచ్చిన వారందరికీ అర్హత లేకపోయినా ఉద్యోగాలు వచ్చేస్తాయి. అందులో హీరోయిన్ పాత్ర ఒకటి.
అల్లరిచిల్లరిగా సాగిపోయే ఈ సినిమాలో కథనం చాలా పేలవంగా వుంటుంది. కొన్ని సన్నివేశాలు ఊహకు అందవు. కోటి రూపాయలు ఇస్తేకానీ తాము తీసే ప్రైవేట్ ఆల్బ్ కు మాజీ మిస్ అరోరా రానని చెప్పగానే.. పైసాకు పనికివారు మరుసటి రోజే కోటి రూపాయలు తెచ్చి ఇస్తారు. ఇదంతా సీక్రెట్ అనుకుంటే సెకండాఫ్ లో కాస్త రిలీవ్ చేసినా సినిమా మొత్తం చూడాలంటే కనీసం ఫస్టాఫ్ వరకైనా ప్రేక్షకుడు చాలా రిస్క్ చేయాల్సి వుంటుంది.
రాజీవ్ కనకాల పాత్ర సినిమాకు కొంత విశ్వసనీయతను చేకూర్చింది, యువకులతో ఆయనకు ఉన్న సన్నివేశాలు సినిమాలో మంచి ఘట్టాలుగా నిలిచాయి. సంగీత పరంగా చూస్తే, దర్శకుడిగా కంటే సంగీత దర్శకుడిగా ఘంటాడి కృష్ణ మెరుగ్గా రాణించారు; కొన్ని పాటలు మంచి ముద్ర వేస్తాయి.
ప్రతికూల అంశాలు:
ఈ సినిమాకు అతిపెద్ద లోపం దానిని తెరకెక్కించిన విధానం. ప్రధాన కథాంశంలో మంచి అవకాశం ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే ఆసక్తిని కలిగించడంలో లేదా వేగాన్ని నిలబెట్టడంలో విఫలమైంది, దీనివల్ల కథనం పెద్దగా ఆకట్టుకోదు. సినిమా ప్రథమార్థం అంతా కథాంశం కంటే గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడిన, ఒకదానితో ఒకటి పెద్దగా సంబంధం లేని సన్నివేశాలతో నిండి ఉంటుంది. ద్వితీయార్థం నేర కోణంపై దృష్టి సారించి, కొన్ని మలుపులను పరిచయం చేసినప్పటికీ, వాటిని సరిగ్గా చిత్రీకరించకపోవడం వల్ల అవి ఎలాంటి నిజమైన ప్రభావాన్ని చూపలేకపోయాయి.
నటీనటుల ఎంపిక మరో ప్రధాన సమస్య. ఒక క్రైమ్ డ్రామాకు నమ్మశక్యమైన నటన అవసరం, కానీ ప్రధాన తారాగణం తమ పాత్రలను నమ్మశక్యంగా చేయడంలో విఫలమయ్యారు. సందీప్ అశ్వ కూడా పర్వాలేదనిపించే నటననే కనబరచగా, మిగతావారు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. వారి భావోద్వేగ సన్నివేశాలు తరచుగా పండలేదు. ఉదాహరణకు, యువకులలో ఒకరి తండ్రికి గుండెపోటు వచ్చిందని తెలిసినప్పుడు, అతని ప్రతిచర్య భావోద్వేగంగా కాకుండా అనుకోకుండా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు పదేపదే సినిమాలోని సీరియస్ నెస్ నీరుగారుస్తాయి. మరోవైపు, సాన్యా ఠాకూర్ పాత్రకు పెద్దగా దోహదపడే అవకాశం లభించలేదు.
సాంకేతిక అంశాలు: ఘంటాడి కృష్ణ సంగీత దర్శకుడిగా విజయం సాధించినప్పటికీ, తన తొలి చిత్రంలో వెనుకబడ్డాడు. కథనంలో లోతు లేకపోవడం వల్ల, సినిమా తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయింది. శివ శర్వాణి ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది, అయితే జగదీష్ కొమారి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు కేవలం సగటు స్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం పెద్దగా ఏమీ చేయలేదు. ఈ సినిమాను వదిలేయడం తేలిక.
రేటింగ్ : 1/5
