సంబంధిత వార్తలు
- Sree Vishnu: నిజాయితీగల కంటెంట్ ఇస్తే శుక్రవారం మనదే అవుతుంది :శ్రీ విష్ణు
- సముద్ర తీరాన మత్స్యకారులతో కలిసిపోయి తెరచాప చిత్రీకరించాం : నవీన్ రాజ్
- Suma: రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ పేరుతో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో సుమ, రాజీవ్
- Rajiv Kanakala: ఆహ్లాదకరమైన మ్యూజిక్ తో ఊరి కథలా తెరచాప ట్రైలర్
- S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్
మత్స్యకారుల జీవితాలలో మరో కోణంగా తెరచాప చిత్రం రివ్యూ
Terachapa - Rajeev kanakala, naveen
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్, సంగీత దర్శకుడు: ప్రజాల్ క్రిష్, ఎడిటింగ్: రాజు బోడసింగి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎంఎల్ రాజా, పి.ఆర్.:మధు VR డిజిటల్ మీడియా, నిర్మాత: కైలాష్ దుర్గం కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్. బేనర్: అనన్య క్రియేషన్స్.
కథ
సముద్రతీరంలోని జాలకీ ప్రాంతం. కొంతమంది జాలరులు ఒక సమస్య వల్ల మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్ర తీరాన ఉండడానికి ఆశ్రయం ఇస్తారు. అలా సజావుగా నడిచిపోతున్న వారి జీవితాలలోకి కొన్ని అంతుచిక్కని సమస్యలు వస్తుంటాయి. గ్రామ ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు కాశీ బాబు అనూహ్యంగా మరణిస్తాడు. అందరూ అది సహజ మరణమని భావించినా, అతని కుమారుడు ఈశ్వర్‌కు అనుమానం కలుగుతుంది. తండ్రి మరణం వెనుక నిజం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో గాయత్రి, సీత పాత్రలు ఎలా సహాయపడ్డాయి? ఆనంద్ రాజు, కేశవ పాత్రలు కథను ఎలా మలుపుతిప్పాయి? అనేది మిగతా కథ.
సమీక్ష:
నవీన్ రాజ్ (ఈశ్వర) కొత్త నటుడు అయినా మంచి పర్ఫార్మెన్స్ అందించారు. నాయికలుగా పూజ (గాయత్రి), శ్రీలు (సీత) తమ తమ పాత్ర పరిధిలో నటిస్తూ కథకు కావలసిన బలాన్ని చేకూర్చి తమను ప్రూవ్ చేసుకున్నారు. శ్రీలు పల్లెటూరి అమ్మాయిలాగా మాస్ గా, క్లాసిక్ డాన్సర్ అయిన పూజ ఒక డీసెంట్ హీరోయిన్గా నేర్పించారు. అలాగే చిత్రంలో కీలకపాత్రను పోషించిన రాజీవ్ కనకాల (ఆనంద్ రాజు), నాగ మహేష్, జగదీష్, పృథ్వీరాజ్ తదితరులు కథలో తమ పాత్రలకు తగ్గట్లు ఇచ్చి సినిమాలో తమదైన ప్రాధాన్యతను చూపించారు.
రాజీవ్ కనకాల పాత్ర సరికొత్తగా డిజైన్ చేశారు. నాగ మహేష్ ఒక మత్స్యకార కుటుంబ పాజిటివ్ తండ్రి క్యారెక్టర్ తో కొత్తగా కనిపించడం విశేషం. పృథ్వీరాజ్ తక్కువగా కనిపించినప్పటికీ తన డైలాగ్స్ తో తనదైన ముద్రణ వేసుకున్నారు. పుష్ప చిత్ర నటుడు జగదీష్ ఈ చిత్రంలో ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. జబర్దస్త్ నటలు రైజింగ్ రాజు, అశోక్, నాగి, అప్పారావు మంచి కామెడీతో పాటు తగ్గ పర్ఫార్మెన్స్ అందించారు. స్వర్గీయ ఫిష్ వెంకట్ గారు ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. దర్శకులు నటీనటులు చాలా బాగా వాడుకున్నారు.
సాంకేతికపరంగా చూస్తే, రొటీన్ కథగా అనిపించినా దానిని వెండితెరపై చూపించడం అనేది చాలా కష్టమైన విషయం అయినా దానిని వినూత్నంగా చూపేలా దర్శకులు జార్జ్ సక్సెస్ అయ్యారు. సంగీతం, విజువల్స్, లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. కొన్నిచోట్ల లిప్సింక్ అంతగా లేనప్పటికీ కథలో లీనమవడంతో ప్రేక్షకులు అంతగా పట్టించుకునే విధంగా లేదు. చిత్రంలో డైలాగ్స్ బాగా పండాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ చాలా న్యాచురల్ గా ఉంది. సిచువేషన్ కు తగ్గట్లు పాటలు వస్తూ తగ్గ డాన్స్ తో అలరించారు. కొత్త నిర్మాత అయినప్పటికీ చిత్రంలోని ప్రతి నిర్మాణ విలువకు మంచి ఆదరణ లభించే విధంగా ఉంది. నిర్మాత ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.
ఇంతకుముందు థండేల్ వంటి పలు సినిమాలు మత్సకారుల జీవితాలపై వచ్చాయి. అయితే ఇందులో వారి జీవితాలలో మత్తు పదార్థాలు వస్తే ఆ కుటుంబాలు ఎటువంటి సంఘర్షణలకు లోనవుతాయి అనే విషయాలను నేటి సమాజానికి అర్థమయ్యే విధంగా తెలియజేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. సినిమాలో సెట్స్, కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ విలువలు, స్నేహ బంధాలు, రాజకీయ కోణాలు, ప్రేమలు, పగలు వంటి అంశాలను టచ్ చేశాడు. ఇందులో కథ, విజువల్స్, క్లైమాక్స్, లొకేషన్స్ బాగున్నాయి. అయితే సాగతీసిన కొన్ని సన్నివేశాలు, ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగుండేది.
రేటింగ్ : 3/5
