సంబంధిత వార్తలు
- Shraddha Das: విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ త్రికాల
- Shraddha Das: మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధాదాస్‘త్రికాల సిద్దమైంది
- ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్
- ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం
- Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్
Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ
Trikala movie cast poster
కథ:
వందలఏళ్ళ నాటి కుమారి ఖండం అనే భూభాగంలో కథ ఆరంభం అవుతుంది. అప్పట్లో అసురులకు దక్కకుండా శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన సాంకేతిక రహస్యాలను అప్పటి మునులు భద్రపరుస్తారు. శక్తి ఏథా” అనే దైవిక ఆయుధంతో వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. ఇది గ్రహించిన అసురులు వర్మను సంహరిస్తారు. ఇక మునులు అతని ఆత్మను ఓ అండంలో బంధిస్తారు. కలియుగం రాగానే ఆత్మ తిరిగి వస్తుందని చెబుతారు. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది.
శివ (మాస్టర్ మహేంద్రన్) ప్రేయసి నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. అతని దగ్గర దుష్టశక్తి ఆవహించిన ఫోన్ ఉంటుంది. ఈ క్రమంలో అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గురించి తెలుస్తుంది. ఇక పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. కుటుంబ సంఘర్షణలు, మానసిక వేదనలతో అతను తన తండ్రిని, పినతల్లి (ఆమని)ని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతని ఆత్మ ఒక భయానక బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. ఇదిలా వుండగా, సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో చిక్కుకుపోతుంది. మరోవైపు అసుర రాజు తిరిగి భూమిపై ఆధిపత్యం సాధించేందుకు మేల్కొంటాడు. అప్పుడు దర్వాడి తాంత్రిక తెగ ఆ మాయా అండాన్ని యాక్టివేట్ చేసి, త్రికాలవర్మ ఆత్మను తిరిగి ఎలా మేల్కొలిపింది? శివకు ఈ కథతో ఉన్న అసలు సంబంధం ఏమిటి? శ్రద్దాదాస్ వీరిపోరాటం ఎలా ఇన్వాల్ అయింది? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఓ బామ్మ, మనవరాలికి చెబుతున్న కథగా ప్రారంభమవుతుంది. దాని సారాంశం ప్రకారం కర్మ సిద్దాంతం సినిమాకు మూల వస్తువు. దానిని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రల మానసిక స్థితి, వారి గతం, పునర్జన్మల ద్వారా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మిళితం చేయడం సినిమాలో ప్రధాన బలం. ఇందులో అజయ్ పాత్ర అద్భుతంగా కనిపించాడు.
ఇక అమాయకత్వం, ప్రేమ, భయం, భావోద్వేగం.. ఇలా విభిన్నమైన ఎమోషన్స్‌ను మాస్టర్ మహేంద్రన్ బాగా చేశాడు. క్లైమాక్స్ వైపు వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగా కనెక్ట్ అవుతుంది.శ్రద్ధా దాస్ ఈ సినిమాకు మరో హైలైట్. తన పాత్రలో గ్లామర్ కంటే మిస్టరీ ఎక్కువగా కనిపిస్తుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు స్పెషల్ డార్క్ టోన్ తీసుకొచ్చింది. ముఖ్యంగా హారర్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె యాక్టింగ్ ఆకట్టుకుంటుంది.
సీనియర్ నటి ఆమని పాత్ర కూడా సినిమాకు కీలకం. తల్లితనంతో పాటు భయం, బాధ, అనుమానం వంటి భావోద్వేగాలను చాలా సహజంగా చూపించింది. ఆమె పాత్ర కథలో ఎమోషనల్ వెయిట్‌ను పెంచుతుంది. ఆమని నటనానుభవం ప్రతి సీన్‌లో కనిపిస్తుంది.
టెక్నికల్ ఫిల్మ్ మేకర్”గా మణి తెల్లగూటి అశ్చర్యపరిచాడు. టేకింగ్ లో సరికొత్త ఫార్మెట్ గా చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా డిజైన్ చేసినట్లు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకాలజికల్ హారర్ అంశాలను ఒకే ప్రపంచంగా చూపించేందుకు ఆయన ఎంచుకున్న ఫ్రేమింగ్ స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే నీడలు, ఖాళీ కారిడార్లు, మసక వెలుతురు, నెమ్మదిగా కదిలే కెమెరా కూడా సినిమాపై ఉత్కంఠత, ఆసక్తి పెంచుతూ ఉంటుంది. దర్శకుడి విజన్ బాగుంది.
అయితే చిన్నపాటి లోపాలున్నాయి. అవి సరిద్దుకుంటే సినిమా పెద్ద స్థాయిలో వుండేది. శ్రద్దాదాస్ మాట్లాడుతుండగా వెనక నుంచి తలపై కొట్టడం అనేవి ఎదుటివాడికి క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా చిన్న పాటి తప్పిదాలు సరిదిద్దుకోవాలి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అయితే భారీ పెట్టుబడి లేకుండా వున్నపాటి ఒనరులను ఉపయోగించుకోవడం విశేషం. డిజిటల్ ఎక్స్‌టెన్షన్స్, CGI బ్యాక్‌డ్రాప్స్ ద్వారా గ్రాండ్ విజువల్ స్కేల్ తీసుకురావడం దర్శకుడి ప్రధాన బలం. సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా తన కెమెరా కేవలం పాత్రలనే కాదు, ప్రతి ఫ్రేమ్ ద్వారా భావోద్వేగాన్ని పలికిస్తుంది. విజువల్స్ ఈ సినిమాకు హైలైట్. చీకటి బంగ్లాలు, తాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలను చూపించేందుకు ఆయన వాడిన లైటింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది.
హారర్ సీన్స్‌లో కెమెరా మూమెంట్స్ చాలా స్లోగా, అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేలా డిజైన్ చేయడం వల్ల ప్రేక్షకుడు కూడా ఆ భయాన్ని అనుభూతి చెందుతాడు. కొన్ని సన్నివేశాల్లో కేవలం లైటింగ్‌తోనే టెన్షన్‌ను క్రియేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.ఇటువంటి కథకు
సంగీతం & బీజీఎం: కీలకమే చెప్పాలి. హర్షవర్ధన్ రామేశ్వరం అందించిన మ్యూజిక్ కథతో రన్ అవుతుంది. ముఖ్యంగా హారర్, తాంత్రిక సీన్లలో బిజిెఎం. బాగుంది.
గ్రామంలోని ప్రజలు జీవన విధానం భక్తిపేరుతో మోసం చేసే పూజారి ఇలా కథనంలో సాగుతాయి. ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘటనలుకూడా ఇందులో కనిపిస్తాయి. VFX సీక్వెన్స్ రియలిస్టిక్ ఫీల్ ఇచ్చింది.
నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత రాధికా శ్రీనివాస్ ఇంట్రెస్ట్ కనిపించింది. స్క్రీన్‌పై ప్రతి ఫ్రేమ్‌లోనూ క్వాలిటీ కనిపిస్తుంది.రొటీన్ కథలకు భిన్నంగా వచ్చిన ఇలాంటి సినిమా చూడతగ్గ సినిమాగా చెప్పొచ్చు. మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్‌ల మేళవింపు.గా వుంది. చక్కటి విజువల్ ఎఫెక్ట్ తో త్రికాల రూపొందింది.
రేటింగ్: 3/5
