Vishwak Sen, Kayadu Lohar
నటీనటులు : విశ్వక్ సేన్, కయాదు లోహర్, సీనియర్ నరేశ్ తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం : సురేష్ సారంగం, కూర్పు : నవీన్ నూలి, సంగీతం : భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, దర్శకుడు : అనుదీప్ కేవీ
విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఫంకీ`.ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు ప్రమోషన్ లో అనుదీప్ తన గత చిత్రం జాతిరత్నాలుకు మించి వుంటుందని పోల్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కొద్దిమార్పులు చేసిన ఫంకీ ఎలా వుందో తెలుసుకుందాం.
కథ :
కోమల్ (విశ్వక్ సేన్) కుటుంబంధాలంటే గలీజ్ గా భావిస్తాడు. వారిని పేర్లు పెట్టి పిలవాలన్నా నచ్చదు. బయట కూడా అంతే. అలాంటి వ్యక్తి సినిమా దర్శకుడు అవ్వాలనుకుంటాడు. అందుకు ఓ నిర్మాత సీనియర్ నరేశ్ సాయంతో 4 కోట్లతో సినిమా అని 40 కోట్లు చేస్తాడు. ఫైనల్ గా ఇంకా 4కోట్లు కావాలనేసరికి గుండెనొప్పి వచ్చి ఆసుపత్రి పాలుఅవుతాడు. తండ్రిని చూడ్డానికి వచ్చిన ఆమె కూతురు చిత్ర (కయాదు లోహర్) రంగంలోకి దిగి డైరెక్టర్ ను మాార్చేయాలనుకుంటుంది. కానీ కోమల్ కుక్కలా వారి ఇంటి చుట్టూ తిరుగుతూ ఎంతో మంది కార్మికుల జీవితాలు సినిమాపైనే వున్నాయని సెంటిమెంట్ తో ఆయింటెమెంట్ రాస్తాడు. ఫైనల్ గా కోటి రూపాయలతో మిగిలిన సినిమా పూర్తిచేస్తానని కాళ్ళా వేళ్లా పడతాడు. చిత్ర ఆమోదం పొందాక షూటింగ్ చేస్తుండగా జి.కె. ( సంపత్) ఫైనాన్సియర్ వచ్చి షూటింగ్ కు అడ్డుపడతాడు. ఆ తర్వాత కోమల్ఏం చేశాడు? అనుకున్నట్లు కోటి లో పూర్తిచేశాడా? , లేదా ? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
సినిమా కథగా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కుటుంబం అంటేనే గలీజ్ అనే వ్యక్తిచేత కుటుంబకథా చిత్రం తీసేలా కథానాయిక చేయడమనేది అంశం. దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎంటర్ టైన్ మెంట్ పేరుతో జబర్ దస్త్ లో వస్తున్న స్కిట్ తరహాలో సినిమా తీశామనిపించాడు. ఈ కథంలో ఎక్కడా సీరియస్ నెస్ వుండదు. హాస్యం పేరుతో అప్పటికప్పుడు డైలాగ్స్ సన్నివేశాలు రాసుకున్న తీసిన సినిమాగా కనిపిస్తుంది. సినిమాలో గలీజ్ అనేది హీరో ఊతపదంలా వుంటుంది. దాన్ని ప్రతిసారీ అనడంతో ప్రేక్షకుడికి కూడా గలీజ్ సినిమా తీసిండు అనిపించేలా వుంటుంది. ఆ డైలాగ్ లలో జాగ్రత్త పడితే బాగుండేది.
నటుడిగా విశ్వక్ సేన్ నటన బాగుంది అనేకంటే బిహేవ్ చేశాడనే చెప్పాలి. ఎటువంటి సన్నివేశాన్ని అయినా ఈజీగా తన మాడ్యులేషన్ తో మైమరిపించాడు. అందుకు కొత్త నాయిక కూడా కయాదు లోహర్ తగినట్లుగా నటించింది. సినిమా తీయాలంటే నిర్మాత పడే కష్టాలు, దర్శకుడు చేసే గలీజ్ పనులు ఈ సినిమాలో స్పష్టంగా చూపించాడనే చెప్పాలి. గతంలో రవితేజతో నేనింతే సినిమాకు దీనికి పోలిక లేకపోయినా నిర్మాత కష్టాలు వాటిని సినిమాటిక్ గా అధిగమించడం అనేది చూపించాడు.
సన్నివేశపరంగా కొన్ని కామెడీ పంచ్ లు పేలాయి. హీరోయిన్ తో సాగే ప్రేమ కథలో కూడా విశ్వక్ సేన్ నటన బాగుంది. దర్శకుడు అనుదీప్ తన స్నేహితులతో ఊరిలో చేసే చేష్టలు ఇప్పటి యూత్ ను కనెక్ట్ అవ్వవచ్చునేమో. జాతిరత్నాలు తర్వాత అంతటి హిట్ సినిమా అని చెప్పుకున్నా ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి. అందులో ముగ్గురు అప్ కమింగ్ హీరోలు. హీరోయిన్ వారి చుట్టూ సాగే సన్నివేశాలు సరికొత్తగా అనిపిస్తాయి.
ఇక ఇందులో కోటి రూపాయలతో సినిమా తీయాలంటే అందుకు తన స్నేహితుల్ని, బంధువులను, ఫైనాన్సియర్ జి.కె. ఫ్యామిలీని జూనియర్ ఆర్టిస్టులుగా వాడుకున్న విధానం సరదాగా వుంటుంది. జి.కె.గా సంపత్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. తల్లిగా నటించిన ఈశ్వరరావు తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. రఘుబాబు పాత్ర కూడా ఓకే..
దర్శకుడు హీరో పాత్రపై ఎక్కువగా శ్రద్ధ చూపడంతో మిగిలిన పాత్రలన్నీ ఆయన చుట్టూ తిరిగేలా డిజైన్ చేసుకున్నాడు. ముఖ్యంగా దిల్ రాజు కూడా నిర్మాతగా చూపిస్తూ, కథ ఎలా వుండాలంటే.. ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు వందల వేల సంవత్సరాలుగా ఓ కథను రాసుకుని బి.సి., ఎ.సి. పెట్టేసి తయారుచేయమని చెప్పడం కూడా ఇప్పుడు వస్తున్న పురాణాల కథలపై సెటైర్ గానూ, వారణాసి పై మరింత దగ్గరగానూ అనిపిస్తుంది. ఇలాంటి అక్కడక్కడా సెటైర్లుంటాయి. దర్శకుడు హరీశ్ శంకర్ నుకూడా పెట్టుకుని దర్శకులపై సెటైర్ గా రాసుకున్నాడు.
ఎన్.టి.ఆర్. సినిమా ప్రీరిలీజ్ కు పాస్ లు ఇస్తాననడం, ఫొటో దిగిపిస్తానడం వంటివి ఇండస్ట్రీలో వున్న వారికి కనెక్ట్ అవుతాయి. ఫైనల్ గా కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యారు. మొత్తానికి స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది.
సెన్సార్ వారికి ఫంకీ అంటే ఏమి అర్థమయిందో కానీ, ప్రేక్షకులకు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమా చూస్తున్నంతసేపు సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి. కానీ, ఒక సీన్ కి మరొక సీన్ కి మధ్య ఆకట్టుకునేవి పెద్దగా లేవు. మొత్తానికి ఓ చిన్న పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో గలీజ్ గా డైలాగ్ లు ఎక్కువ రాసుకున్నాడు.
సాంకేతికంగా చూస్తే, దర్శకుడు రాసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేదనే చెప్పాలి. మొత్తం విశ్వక్ సేన్ చేశాడా? అన్నట్లుగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా సురేష్ సారంగం చిత్రీకరించారు. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మొత్తంగా చూస్తే, ఓ వర్గానికి బాగా ఆకట్టుకునే సినిమాగా చెప్పవచ్చు.
రేటింగ్ : 2.75/5