1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Was Surya's Veerabhadrudu a success or not? Veerabhadrudu Review

Veera Bhadrudu Review: సూర్య నటించిన వీర భద్రుడు సక్సెస్ అయ్యాడా? లేదా? వీరభద్రుడు రివ్యూ

Suryia - Veerabhaddrudu
Suryia - Veerabhaddrudu
నటీనటులు : సూర్య, త్రిష కృష్ణన్, ఆర్జే బాలాజీ, స్వాసిక, ఇంద్రన్స్ తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం : జి.కె. విష్ణు, సంగీతం : సాయి అభ్యంకర్, నిర్మాతలు : ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, దర్శకుడు : ఆర్జే బాలాజీ
 
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. దానిని తెలుగులో “వీర భద్రుడు గా నేడు విడుదలయింది.కొన్ని కారణాల వల్ల సినిమా ఒక్కరెోజు లేట్ గా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ అభిమానులను ఎంతగానో అలరించింది. సూర్య వివిధ గెటప్స్ తో ఆకట్టుకున్నాడు. త్రిష కూడా నాయిక కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తినెలకొంది. మరి నేడు విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
తమిళనాడుకు చెందిన పెద్దాయన ఇంద్రన్స్), తన కూతురి తీసుకుని ఓ సర్జరీ కోసం హైదరాబాద్ వస్తాడు. కానీ వీరిదగ్గర వున్న డబ్బు, నగా అంతా దొంగలు దోచేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొంగలు పట్టుకుంటారు. కానీ వారి నగలు రికవరీ చేయలేరు. దాంతో కోర్టును ఆశ్రయిస్తారు. అలా కోర్టుకు వెళ్టగానే బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే లాయర్ పరిచయం అవుతాడు. ఆ లాయర్ పెద్ద అవినీతిపరుడు. ఈ లాయర్ రికవరీ పేరుతో వీరిని మరింత ఇబ్బంది పెడుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరిలో గ్రామ దేవతను పూజించే వీరభద్రుడు (సూర్య) లాయర్లకు బుద్ధి చెప్పడానికి లాయర్ వేషంలో వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరభద్రుడు అసలు ఎవరు? నగలు పోగొట్టుకున్న వారికి ఈయనకు సంబంధం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
సూర్య సినిమాలంటే సింగమ్ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఇందులో మాస్ ప్రేక్షకులను అలరించేందుకు పూర్తి మాస్ యాక్షన్ సినిమాగా దర్శకుడు తీర్చిదిద్దాడు. సూర్య ఎనర్జీని దర్శకుడు బాగా ఉపయోగించుకున్నాడు.  సెకండ్ హాఫ్ లలో మంచి థియేట్రికల్ మూమెంట్స్ ని డిజైన్ చేయడం బాగుంది.  
 
ఇప్పటివరకు చేయని సరికొత్తగా సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అవతార్ లో సూర్య మెప్పించాడు.మొదటి నుంచి పాత్ర డిజైన్ కొత్తగా వుంటుంది. ఊరిలోని అమ్మవారి ఆవహించడం ఏమిటి? ఎందుకు? అనేది సరికొత్తగా కనిపిస్తుంది.  మొదటిలో సాదాసీదాగా సాగుతూ క్లైమాక్స్ లో ఆశ్చర్యపరిచేలా ఆయన పాత్ర వుంటుంది.   సూర్య తన విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. అయితే ఇంత కష్టం కుటుంబంప్రేక్షకులను కూడా అలరిస్తుందో లేదో అనేది అనుమానమే.
 
కేవలం మాస్ ప్రేక్షకులను అలరించేందుకు చేసిన సినిమా ఇది.  కోర్టు సీన్ లో ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, నట్టి, త్రిష  ఇతర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేర నటించారనే చెప్పాలి. అయితే మొత్తంగా చూస్తే, కథాపరంగా చూస్తే, సాదాసీదాగా అనిపిస్తుంది. కథలో మలుపులు, కొత్తదనం అనేవి కొరవడిందనే చెప్పాలి. అమ్మవారి సెంటిమెంట్, భక్తుడు దేవత ఆవహించడం వంటి అంశాలు చూపించినా అవి లాజిక్కుకు అందనివిగా అనిపిస్తాయి.
 
కథ చెప్పే విధానంలో  కాస్త స్లోగా సాగుతాయి, సూర్య పాత్ర వచ్చేవరకూ డల్ గా వుంటుంది. సింగంలో సూర్యకు తీసుకున్న డబ్బింగ్ కేర్ ఈ సినిమాలో లోపంగా కనిపించింది. దానితో ఆవేశంతో కూడిన సన్నివేశాలలో ఆకట్టుకోవడానికి సమయం పడుతుంది. దర్శక నిర్మాతలు దీనిపై శ్రద్ధ పెడితే బాగుండేది. తమిళంలో బాగానే చూస్తారు. ఒరిజినల్ వాయిస్ కనుక. ఇక్కడ అంత డెప్త్ లేదు అనిపిస్తుంది. అయితే తమిళ సినిమా కనుక సన్నివేశపరంగా తమిళంలో సాగే సంభాషణలు కూడా వుంటాయి. కథప్రకారం అలా పెట్టినా అవి ఎందుకనే కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. 
 
 సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే పాటలు తమిళం కనుక తెలుగులో వచ్చే సరికి అవి పక్కా అనువాదంతో కూడిన పదాలు ఎట్రాక్ట్ గా అనిపించవు. ఇక సాహితం కొన్నిసార్లు అర్థంకాదు. ఏదో హడావుడి ఈ సినిమా బయటకు పంపించేయాలనేలా అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు పనితీరు చాలా బాగుంది. అమ్మవారు ఆవహించే సన్నివేశంలో ఆయన పనితనం హైలైట్.  రెడ్ చిల్లీస్ చేసిన కలరింగ్ సినిమా మూడ్‌కు పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పడానికి ఏమీలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
దేవత అంశతో కూడిన పాయింట్ తీసుకున్నప్పుడు  దర్శకుడు ఆర్జే బాలాజీ మరింత కేర్ తీసుకోవాల్సింది.  దేవుని పవర్స్ కు కొన్ని లిమిటేషన్స్ పెట్టడం ద్వారా అందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను జోడించాడు. సూర్యను చాలా సాలిడ్‌గా ప్రెజెంట్ చేశాడు, కానీ రైటింగ్ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుంది. ఫైనల్ గా చూస్తే, కొత్తగా సూర్యని ఫ్యాన్స్ ఇందులో మళ్ళీ చూస్తారు. అలాగే సినిమాలో కొన్ని ఎంజాయ్ చేసే ఎపిసోడ్స్ ఉన్నాయి. డబ్బింగ్ సినిమా కావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. తెలుగులోనూ పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో సూర్య చిత్రమైన సరైన కథగా వస్తే బాగుండేది. మరి తమిళ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారేమో చూడాలి.
రేటింగ్: 2.5/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లో రోహిత్ సరాఫ్ షెడ్యూల్ పూర్తి