తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్
Daughter of Prasad Rao Trailer,
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. రెక్కీ, విరాటపాలెం మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?.. ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో చాలానే ట్విస్టులు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది.
ఇక స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్ అయింది? దీని వెనుకున్నది ఎవరు? హాస్టల్‌లో స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఇక ఈ మిస్టరీలు తేలాలంటే ఫిబ్రవరి 27 వరకు ఆగాల్సిందే. జీ5లో ఈ మూవీని ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీకి మైదాల శృతి మాటల్ని రాయగా.. శ్రీ రామ్ మద్దూరి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రానికి చంద్రశేఖర్ జి.వి. ఎడిటర్‌గా, రామ్ కె మహేష్ కెమెరామెన్‌గా పని చేశారు. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.
తారాగణం : రాజీవ్ కనకాల, వాసంతిక, ఉదయ్ భాను, గాయత్రి భార్గవి, హిమ బిందు తదితరులు
సాంకేతిక సిబ్బంది
నిర్మాత పేరు - కె.వి.శ్రీరామ్
ప్రొడక్షన్ హౌస్ - సౌత్ ఇండియా స్క్రీన్స్
దర్శకుడు - కృష్ణ పోలూరు
స్క్రీన్ ప్లే - కృష్ణ పోలూరు
డైలాగ్ రైటర్ - మైదాల శృతి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - శ్రీ రామ్ మద్దూరి
ఎడిటర్ - చంద్రశేఖర్.జి.వి
సినిమాటోగ్రాఫర్ - రామ్ కె మహేష్