1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. My health is fine—I'm not acting in Telugu films simply because I'm busy with Punjabi and Tamil projects: Payal Raj puth

Payal: ఆరోగ్యం బాగుంది - పంజాబీ, తమిళ చిత్రాల్లో బిజీ వల్లే తెలుగులో నటించడంలేదు : పాయల్

Payal Rajput
Payal Rajput
ఫస్ట్ టైం సినిమా ట్రైలర్ లాంచ్ నటి పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన వేడుకకు ఆమె హాజరై పలు విషయాలు తెలియజేశారు.  కొంతకాలం గ్యాప్ తర్వాత మీ అందరిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది.

కొన్ని తమిళ పంజాబీ చిత్రాల వల్ల నేను హైదరాబాద్ కు రాలేకపోతున్నాను. తెలుగు మీడియా వారిని మరోసారి ఇలా కలవడం చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ టైం చిత్ర ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఆరోగ్యం బాగోలేదని రకరకాలుగా వార్తలు కూడా విన్నాను. సహజంగా ప్రతివారికి వున్నట్లే చిన్నపాటి సమస్యలుంటాయి. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. 
 
ఇక చిత్ర దర్శక నిర్మాత హేమంత్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రస్తుతం సినిమా చాలా మారిపోయింది. గత రోజులతో పోలిస్తే ఇప్పుడు కథలు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ చూస్తే ఎంతో కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చూస్తే షాకింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి హీరోయిన్ రాలేకపోయారు. వేరే చిత్ర షూటింగ్ వల్ల బిజీగా ఉన్న ఆమె తర్వాత ఈవెంట్స్ లో కచ్చితంగా ఉంటారు. తెలుగు ప్రేక్షకులు టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు విజయం అందించడంలో ఎప్పుడు ముందుంటారు. అదేవిధంగా ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. 
 
నేను గత కొన్ని సంవత్సరాలుగా శౌరబ్ ను చూస్తున్నాను. అతని డేడికేషన్ నాకు తెలుసు, ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డారు. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా షౌరబ్ ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక బృందం వారికి ఆల్ ద బెస్ట్. మే 22న ఈ చిత్ర విడుదల కోసం నేను ఎదురు చూస్తున్నాను" అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
అనకాపల్లి నుంచి అమ్మోరు దిగినాది.. అనే జాతర సాంగ్ రిలీజ్