1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. My wife is an even bigger fan of his than I am: Allari Naresh

Allari Naresh: నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్ : అల్లరి నరేష్

Allari Naresh, Thiruveer, S.P. Durga Naresh, Harish Shankar
Allari Naresh, Thiruveer, S.P. Durga Naresh, Harish Shankar
తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌‌ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన టీజర్‌,సాంగ్స్ కు మంచి అప్లాజ్ వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిలుగా హాజరైన ఈ వేడుకు గ్రాండ్ గా జరిగింది.
 
అల్లరి నరేష్ మాట్లాడుతూ, దశరథ్ గారిని యాక్టర్స్‌గా చూడడం చాలా ఆనందంగా ఉంది. ‘పాపం ప్రతాప్’ను ఏప్రిల్ 17న తప్పకుండా చూస్తాను. రాధాకృష్ణ గారు తెలుగుపై మంచి పట్టు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాతో మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకకు నేను రావడానికి కారణం తిరువీర్. నాకంటే నా వైఫ్ ఆయనకు ఫ్యాన్. మేము ఇంట్లో ఎప్పుడూ “సమోసా తింటావా శిరీష” అని సరదాగా మాట్లాడుకుంటాం. ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. అది చాలా మంచి సినిమా. 
 
ఆయనకు ఇండస్ట్రీలో ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. తిరువీర్  నాకు బ్రదర్‌లాంటివారు.ఈటీవీ విన్ సాయి నితిన్ గారు కంటెంట్ తీసుకొస్తే అది చాలా బాగుంటుందని నమ్మకం. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఇలా వరుసగా చిన్న సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నారు. ‘పాపం ప్రతాప్’ కూడా పెద్ద సక్సెస్ అయి ఆ విజయాన్ని కొనసాగించాలి. కామెడీ సినిమాలు తగ్గుతున్నాయి. ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారి పేరును ప్రస్తావించారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా కామెడీ ఎంటర్‌టైనర్స్ ఇంకా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
 
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ, ట్రైలర్ చూస్తుంటే తిరువీర్ కంటే ప్రతాప్ క్యారెక్టర్ ఎక్కువగా కనిపించింది. డైరెక్టర్ నరేష్‌కు తెలుగు, కథపై మంచి పట్టు ఉందని ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. చాలా అద్భుతంగా తీశారు. నరేష్ గారికి సినిమా అంటే ప్యాషన్. ఇవివి సత్యనారాయణ గారు నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన సినిమాలు చూడకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. నరేష్ గారిని ఎప్పుడైనా కలిసినా ఆయన నాన్నగారు గుర్తొస్తారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా ఉందని నమ్ముతున్నాను. ‘పాపం ప్రతాప్’ జనాలను థియేటర్లకు రప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా టికెట్ ₹100 లోపే ఉంది. ఈ బంపర్ ఆఫర్ మళ్లీ దొరకదు. అందరూ ఏప్రిల్ 17న థియేటర్లలో సినిమా చూడాలని కోరుతున్నాను.
 
హీరో తిరువీర్ మాట్లాడుతూ, ఈ సినిమాలో మా తండ్రి పాత్రని చాలా సహజంగా చేశారు.  ‘పాపం ప్రతాప్’ సినిమా ఇవివి సత్యనారాయణ గారి సినిమాలా అనిపిస్తుంది. “మగాడు అంటే ఏడవకూడదు, బాధపడకూడదు” అంటారు. కానీ మగాడు కూడా మనిషే..  ఆ భావాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 17న మీ దగ్గరలోని థియేటర్లకు వస్తాను. ‘పాపం ప్రతాప్’.. ‘వీర ప్రతాప్’అనిపించుకుంటాను.  థ్యాంక్యూ.
About Writer
దేవీ
తర్వాతి కథనం
బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి, రూ. 600 ఆసుపత్రి బిల్లు కట్టలేక అక్కడే మృతదేహం