మంగళవారం, 9 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2025 (17:54 IST)

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

O.. Chelia team with Srikanth
O.. Chelia team with Srikanth
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ.. చెలియా’ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగానే రీచ్ అయ్యాయి. రీసెంట్‌గా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం.
 
ఇక తాజాగా టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, నాకు టీజర్ చాలా నచ్చింది. యంగ్ టీం అంతా కలిసి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
టీజర్‌ను గమనిస్తుంటే.. హారర్, లవ్, యాక్షన్ జానర్లను మిక్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. భయపెట్టించే అంశాలు చాలానే ఉన్నాయని అర్థం అవుతోంది. ఇక ఈ హారర్ కాన్సెప్ట్‌లో చేసిన ఈ ప్రేమ కథ ఏంటి? మధ్యలోకి ఈ దెయ్యాల కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది.
 
ఈ టీజర్‌లో సురేష్ బాలా కెమెరా వర్క్, ఎంఎం కుమార్ ఆర్ఆర్ హైలెట్ అవుతోంది. ఈ చిత్రానికి ఉపేంద్ర ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.