Haigh: నలుగురు వ్యక్తుల హై కోరికల నేపథ్యంతో హై మూవీ టీజర్
Anil, Dil raju, D sureshbabu
అనిల్ రావిపూడి అసోసియేట్ ఎస్ కృష్ణ 'హై' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఈరోజు లాంచ్ చేశారు.
ఈ టీజర్ ఒక గ్రిప్పింగ్ ఆంథాలజీగా "హై"ని అర్థం చేసుకునే నలుగురు వ్యక్తులను ప్రజెంట్ చేసింది. ఒక అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఒకరిని నియమించుకుంటుంది, మరొక వ్యక్తి మద్యంలో తన హై వెతుక్కుంటాడు, మరొక అమ్మాయి తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడంలో తాను హై ఫీలౌతుంది ఆమె ప్రేమికుడు ప్రమాదకరమైన పందాల కాస్తాడు.
ఎస్ కృష్ణ ఒక బోల్డ్ కథని ఎమోషన్స్ తో కూడిన డ్రామాగా ప్రజెంట్ చేశారు. మొత్తం తారాగణం అద్భుతమైన పెర్ఫారమెన్స్ లతో ఆకట్టుకున్నారు.
సినిమాటోగ్రాఫర్లు మల్లు నాయక్, సునీల్ రెడ్డి గట్టి క్లోజప్‌లు, స్పీడ్ కట్‌లు , కలర్ పాలెట్‌ను వాడుకున్న తీరు ఆకట్టుకుంది. ఇవన్నీ అడ్రినలిన్-పంపింగ్ వైబ్రెన్సీని ఇచ్చాయి. సంగీత దర్శకుడు వికాసా పల్సేటింగ్ స్కోర్‌తో ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేశారు. జిఆర్‌కె శరణ్ రావుల ఎడిటర్, వి వెంకట్ యాక్షన్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా టాకీ భాగం పూర్తయింది, పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ, హైదరాబాద్ లైవ్ లొకేషన్స్ లో ఈ సినిమా తీశారు. సినిమా డబుల్ పాజిటివ్ చూశాను. అద్భుతంగా వుంది. సాయి ఇలాంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. తను చాలా ముక్కు సూటిగా ఉంటాడు. ఈ సినిమాకి హై అనే టైటిల్ పెట్టారు. అలాంటి హై అందరికీ రావాలి అన్నారు.