Rajiv Kanakala: ఆహ్లాదకరమైన మ్యూజిక్ తో ఊరి కథలా తెరచాప ట్రైలర్
Naveen Raj Shankarapu, Pooja Suhasini, Sreelu, Rajiv Kanakala
అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.
తెరచాప ట్రైలర్ చూస్తుంటే ఆహ్లాదకరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మొదలై సముద్రతీరంలో ఉండే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడం కూడా సహజమే. అటువంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితుల పట్ల పోరాడుతున్నట్లు అర్థమవుతుంది. డైలాగ్స్ ఇంకా టేకింగ్ చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్ సృష్టించే విలేజ్ పొలిటికల్ డ్రామాలా అనిపిస్తుంది.
తారాగణం: నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేష్, పృధ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్దస్త్, నాగి జబర్దస్త్, అప్పారావు జబర్దస్త్, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, శ్రీనివాస్ నేస, మాయమచంద్ర, సకారం తదితరులు
