Renu Desai: మలేషియా వెళ్ళి ఎంజాయ్ చేసే బ్యాడ్ గాళ్స్‌కు ఏమయింది?
బ్యాడ్ బాయ్స్ గురించి విన్నాం. కానీ బ్యాడ్ గాళ్స్ గురించి పెద్దగా తెలీదు. అందుకే వారి నేపథ్యంగా బ్యాడ్ గాళ్స్ చిత్రం రూపొందింది. రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణంతో రూపొందింది. ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి బ్యాడ్ గాళ్స్.. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
దర్శకుడు మారుతి ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుంది, ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు, ఆడవారికి ఇంపార్టెంట్ ఇచ్చే సినిమా తప్పక ఆడాలి. ఈనాటి ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో తీసిన చిత్రం ఇది. తప్పక చూడండి, ఈ బ్యాడ్ గాళ్స్ చిత్రాన్ని ఆదరించండి అని తెలిపారు.
ట్రైలర్ పరంగా చూస్తే, రేణు దేశాయ్ లెక్చరర్ గా బ్యాడ్ గాల్స్ గురించి చెబుతూ ప్రారంభమవుతుంది. నలుగురు కోనసీమకు చెందిన అమ్మాయిలు విమానంలో మలేషియా వెళ్ళడం. అక్కడ ఓపెన్ కావడం, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం, మందు కొట్టడం వంటి చర్యలు చేస్తుండగా, రేప్‌కు గురయ్యే సందర్భం వస్తుంది. ఆ సమయంలో ఏమి చేశారనే పాయింట్ తో ట్రైలర్ చూపించారు. ఫైనల్ గా ఓ సందేశంతో తీసినట్లుగా చూపించారు.